కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ముస్లింల పట్ల తరతరాలుగా కొనసాగుతున్న వివక్షకు తోడు.. హిందుత్వ రాజకీయాలతో లౌకిక వాదానికి విఘాతం కలిగే అవకాశముం దని ప్రముఖ జర్నలిస్టు, రచయిత ఏఎం.ఎజ్దానీ(డానీ) అన్నారు. మానవహక్కుల నేత దివంగత డాక్టర్ బాలగోపాల్ రాసిన ‘ముస్లింల ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయా లు’ పుస్తక పరిచయ సభ హన్మకొండలోని ఆర్‌ట్స కళాశాల సెమినార్ హాల్‌లో ఆదివారం జరిగింది.
మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సభలో డానీ ముఖ్యవక్తగా మాట్లాడుతూ ప్రపంచానికి సమానత్వాన్ని చాటిచెప్పిన ఇస్లాం మతాన్ని ఆదరించాల్సింది పోయి హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారు ముస్లింలను అసాంఘిక శక్తులుగా పేర్కొనడం బాధాకరమన్నారు. బీజేపీ ప్రచారం చేస్తున్నట్లు గుజరాత్‌లో అంతగా అభివృద్ధి జరగలేదన్నారు. ఇక్కడ చంద్రబాబు సీఎంగాఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని చెప్పినా.. ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమిటో గుర్తించాలన్నారు.
బీజేపీ వైఖరి సిగ్గుచేటు
2002 సంవత్సరంలో నరేంద్రమోడీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటన జరిగినా ఆయననే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం గర్హనీయమని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వీఎస్.కృష్ణ అన్నారు. ప్రముఖ కవి, రచయిత సిరాజుద్దీన్ మాట్లాడుతూ తీవ్రవాదులందరూ ముస్లింలు కాదని, ఈ విషయాన్ని గుర్తించి ముస్లింలు అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.
సమావేశంలో దళితరత్న బొమ్మల కట్టయ్య, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాల శోభారాణి, జిల్లా ప్రధా న కార్యదర్శి బాదావత్ రాజు, బాధ్యులు డాక్టర్ సాదు రాజేష్, పాలకుర్తి సత్యం, వెంకటనారాయణ, బండి కోటి, యాదగిరి, దాడబోయిన రంజిత, బీరం రాము, ప్రకాష్, రవీందర్, సాహితి పాల్గొన్నారు. ఈ సదస్సులో తొలుత ‘ముస్లింల ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
హిందుత్వ రాజకీయాలతో లౌకికవాదానికి విఘాతం
Published Mon, Mar 31 2014 3:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement