సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్ 5, వరంగల్ 3, ఆదిలాబాద్, మేడ్చల్, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో 8 మంది మరణించతో మొత్తం మృతుల సంఖ్య 113కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 40 మంది కోలుకోగా మొత్తం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1627కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment