మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతికంపు
పనులు పూర్తికాకుండానే బిల్లులు స్వాహా
సమగ్ర విచారణకు పంచాయతీ పాలకుల డిమాండ్
గంభీరావుపేటలో అక్రమాలు
దోషులను శించాలి : కాంగ్రెస్ పార్టీ నాయకులు
గంభీరావుపేట : పైఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేరు ఇరిగి నర్సయ్య- బాలవ్వ. గంభీరావుపేటలోని బరిగెలగూడెం కాలనీ. వీరి పేరిట మరుగుదొడ్లు మంజూరయ్యూయని, నిర్మాణం కూడా పూర్తరుుందని, రూ.24వేలు డ్రా అయ్యూయని రికార్డుల్లో ఉంది. కానీ వాస్తవ పరిస్థితిలో ఒక్కమరుగుదొడ్డి కూడా పూర్తి కాలేదు. నిర్మాణానికి అవసరమైన ఇటుకలు, ఇతరసామగ్రి ఎవరూ ఇవ్వలేదు. గుంతలు కూడా వారే తవ్వుకున్నారు. ఒక్కపైసా బిల్లుకూడా విడుదల కాలేదు.
బరిగెలగూడెం కాలనీకి చెందిన గ్యార కనుకరాజుకు మరుగుదొడ్డి మంజూరైనట్లు, పూర్తయినట్లు, రూ.12వేలు డ్రా అయినట్లు రికార్డుల్లో ఉంది. ఈ విషయం తనకు తెలియదని కనుకరాజు చెబుతున్నాడు.బరిగెలగూడెం కాలనీకి చెందిన ఇరిగి యాదమ్మ పేరిట రెండు మరుగుదొడ్లు మంజూరయ్యాయి. కానీ ఒక్కటి కూడా పూర్తికాలేదు. నాసిరకం ఇటుకలు ఇచ్చారు. సొంతంగా మట్టి ఇటుకలతో నిర్మాణం చేపట్టినా ఇంకా పూర్తికాలేదు. కానీ, ఆమెకు రెండుమరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, రూ.24వేలు డ్రా అయ్యాయని తెలిసి అవాక్కయింది.
ఇవీ గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు. ఇవి కేవలం మచ్చుకు కొన్నే. ఇలాంటి ఇంకా అనేకం ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపారనే ఆరోపణలు ఉన్నారుు. సర్పంచ్, సహకరించిన అధికారులపై చర్య తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, వార్డుసభ్యులు మూడు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 834 వ్యక్తిగతమరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో నేటికీ 263 మరుగుదొడ్లు నిర్మాణం ప్రారంభం కాలేదు. 23మంది పేర్లు రికార్డుల్లో రెండుపర్యాయూలు రాశారు. గతంలో ఈజీఎస్‌లో నిర్మించుకున్న ఐదింటిని సైతం ఇదేజాబితాలో చేర్చారు. ఇట్లాంటి వాటిపేరి ఇప్పటి వరకు రూ.92,62,227 డ్రా చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వస్తున్నారుు. ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.