కరోనా: సత్యనాదెళ్ల సతీమణి విరాళం! | Covid 19 Anupama Nadella Donates Rs 2 Crore To Telangana CM Relief Fund | Sakshi
Sakshi News home page

కరోనా: రూ.2 కోట్లు విరాళమిచ్చిన సత్య నాదెళ్ల భార్య

Published Tue, Mar 24 2020 7:10 PM | Last Updated on Tue, Mar 24 2020 8:20 PM

Covid 19 Anupama Nadella Donates Rs 2 Crore To Telangana CM Relief Fund - Sakshi

ఆమె తండ్రి, మాజీ ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి చెక్‌ అందజేశారు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై యుద్ధానికి వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, టెక్‌ దిగ్గజాలు ఆర్థిక సాయం చేసి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుమప నాదెళ్ల కూడా ఆ కోవలో చేరారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ఆమె రూ.2 కోట్ల బూరి విరాళం ప్రకటించారు. ఈమేరకు ఆమె తండ్రి, మాజీ ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి చెక్‌ అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆ మొత్తం కేటాయించనున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం మరో మూడు కేసులు నమోదు కావడంతో వైరస్‌ బాధితుల సంఖ్య 36కు చేరింది. అయితే, సత్వర వైద్య సదుపాయంతో బాధితులు కోలుకుంటున్నారు.
చదవండి: 
చైనాలో బయటపడిన మరో వైరస్‌!
కరోనా ఎఫెక్ట్‌: అనుకున్నట్లే వాయిదా పడింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement