ఖతర్‌లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది.
తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతర్‌పై తోటి గల్ఫ్ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతర్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి.