హైదరాబాద్‌లో డేటా అనలిటికల్ హబ్
► త్వరలో ఏర్పాటు చేస్తాం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే లా విద్యార్థులకు శిక్షణతోపాటు వారిలో నైపుణ్యాలను పెంచేందుకు హైదరాబాద్‌లో త్వర లో డేటా అనలిటికల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. డిజిటల్ ఇండియా లో భాగంగా ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివా రం జరిగిన డిజిటల్ బ్లేజర్స్ అవార్డుల కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువతకు దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఉందని, వారిలో దాగిన ప్రతి భను వెలికితీసి ప్రోత్సహించేందుకు టీ హబ్‌ను నెలకొల్పామన్నారు.
ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ ఐటీ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌లో ఉన్నాయని, వైద్య, విద్యా రంగాల్లోనూ ఐటీ సాంకేతికతను విస్తృతం చేస్తామని చెప్పారు. టీ హబ్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ భగీరథ తరహాలో ఫైబర్‌గ్రిడ్ ద్వారా ఇంటిం టికీ ఇంటర్నెట్ సేవలు అందిస్తామన్నారు. నూ తన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన రవాణా, పోలీసు విభాగాలకు కేటీఆర్ డిజి టల్ బ్లేజర్స్ అవార్డులను అందజేశారు. రవాణాశాఖ రూపొందించిన ఎం-వ్యాలెట్‌తోపాటు సైబ రాబాద్ కమిషనరేట్‌లో ఐటీ సేవలకుగాను పోలీసు విభాగానికి అవార్డులు ఇచ్చారు.