కారెక్కిన ‘ముదుగంటి’ | DCMS chairman muduganti Surenderreddy join trs | Sakshi
Sakshi News home page

కారెక్కిన ‘ముదుగంటి’

Published Mon, Feb 22 2016 2:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

కారెక్కిన ‘ముదుగంటి’ - Sakshi

కారెక్కిన ‘ముదుగంటి’

టీఆర్‌ఎస్‌లో చేరినడీసీఎంఎస్ చైర్మన్
కాంగ్రెస్‌కు మరో ఝలక్


కరీంనగర్ సిటీ : జిల్లా పరస్పర సహాయ సహకార పరపతి సంఘం(డీసీఎంఎస్) చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన ఆదివారం రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స మక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్‌అండ్ బీ గెస్ట్ హోస్‌లో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శో భ ఆధ్వర్యంలో సురేందర్‌రెడ్డికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సురేందర్‌రెడ్డితో పాటు డీసీఎంఎస్ డెరైక్టర్లు టి.రాజేశ్వరరావు, లోకే ష్, సింగిల్‌విండో చైర్మన్ కిషన్‌రెడ్డి, స ర్పంచులు జోగు రవీందర్, భూంరెడ్డి, చారి, కొమురయ్య, బెల్లం ప్రతాపరెడ్డి, బోయినిపల్లి ఎంపీటీసీ పిట్టల రమేశ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు దాదాపు 200 మందితో ఆయన కారెక్కా రు. జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ఝలక్..
సురేందర్‌రెడ్డి అనూహ్యంగా పార్టీని వీడడంతో కాంగ్రెస్‌కు షాక్‌తగిలింది. బోయినిపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన ఆయన.. సీనియర్ నాయకుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరగా, తాజాగా సురేందర్‌రెడ్డి కూడా కారెక్కడంతో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బక్కచిక్కినట్లరుు్యంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్, ఒక ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండేవి. ఇందులో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పార్టీ మారడంతో ఆ పదవులు కూడా అధికార పార్టీ ఖాతాలో పడ్డాయి.

అభివృద్ధికి సహకరిస్తా..
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే తాను టీఆర్‌ఎస్‌లో చేరినట్లు డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి అన్నారు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.

అందిరికీ సమాన గుర్తింపు  : మంత్రి ఈటల రాజేందర్
టీఆర్‌ఎస్‌లో చే రిన వారితో పాటు అందరికీ సమాన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ 18 నెలల మా పాలనకు ప్రజల ఆమోదం లభించిందన్నారు. హైదారాబాద్, వరంగల్, నారాయణఖేడ్ ఎన్నికలు ఇందుకు తార్కాణమన్నారు. రాబోయే వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం టీఆర్‌ఎస్‌దేనన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని, అన్నింటికీ కేసీఆర్ పాలన సమాధానం చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఇటీవల కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ జనరంజక పాలన ఉందని కితాబిచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement