సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రధాని మోదీ వేడి తగ్గింది.. రాహుల్ గాడి తప్పిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదే కీలక సమయమని, కాంగ్రెస్, బీజేపీలకు కీలెరిగి వాత పెట్టాలన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు అనిల్ జాదవ్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుమారుడు మనోజ్ కుమా ర్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్త లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పాలన దేశానికి ఆదర్శంగా నిలవాలంటే.. పార్లమెంటులో పదహారు గులాబీలు ఉండాల్సిందేనన్నారు.
‘బోధ్ నియో జకవర్గంలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలిం చడానికి వచ్చిన మీకందరికీ స్వాగతం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా టీఆర్‌ఎస్‌లో చేరుతుండటం శుభసూచకం. అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ జాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 35 వేల ఓట్లు తెచ్చుకున్నారంటే ఆయనకు ప్రజల్లో ఉన్న అభి మానం అర్థమవుతోంది. మనోజ్ పార్టీలో చేర డం నకిరేకల్‌లో కేడర్ బలోపేతానికి దోహదపడుతుంది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే రాహుల్, మోదీలకే లాభం. తెలంగాణకు కాదు. కాంగ్రెస్ సంక్షోభం లో ఉంది. అదను చూసి దెబ్బ కొట్టాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి కాంగ్రెస్ ఎంపీ టికెట్లిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెల్లని రూపాయలు పార్లమెంటు నియోజకవర్గాల్లో చెల్లుతాయా? చినిగిన నోటు ఎక్కడా చెల్లదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment