
వికలాంగులకు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాలి
హైదరాబాద్ : శారీరక వైకల్యం ఉన్న వారికి రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పలువురు నేతలు కోరారు. అఖిల భారత వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ శుక్రవారం చిక్కడపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభ నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు రాజకీయ, ఉద్యమ పార్టీల నేతలు హాజరై వికలాంగులకు మద్దతు తెలిపారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అన్ని రంగాల్లో సమప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విమలక్క ఇతర రాజకీయ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.