డిప్యూటీ సీఎం చెప్పినా.. తీరు మారలేదు | Deputy Chief said that the pattern can not be changed .. | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం చెప్పినా.. తీరు మారలేదు

Published Thu, Oct 2 2014 3:03 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

Deputy Chief said that the pattern can not be changed ..

  • జనగామ ఏరియా ఆస్పత్రిలో బయటపడిన వైద్యుల నిర్లక్ష్యం
  •  మరోమారు ఆస్పత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  •  ఇప్పటికీ తీరు మార్చుకోని వైద్యులు
  •  వైద్యాధికారుల నిర్వాకంపై కలెక్టర్ ఫిర్యాదు
  • జనగామ రూరల్ : డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య ఏరియూ ఆస్పత్రిని సందర్శించి.. వైద్యులను, సిబ్బం దిని హెచ్చరించినా వారు పనితీరు మార్చుకోలేదు. ఆయన వచ్చి వెళ్లి 24 గంటలు గడవక ముందే విధు ల్లో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి బుధవారం మరోసారి ఆస్పత్రిని సం దర్శించి.. రికార్డులు పరిశీలించి డ్యూటీ డాక్టర్ పద్మ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాశారు.

    డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంగళవారం ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి.. వైద్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా వారు వెళ్లిపోయూక 11 రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందిన వ్యక్తిని గురించి వైద్యులు పోలీ సులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టకు చెందిన మృతుడు కంచర్ల రంగాచారి(43) చనిపోయి రోజులు గడుస్తున్నా.. అతడి మరణవార్తను బంధువులకుగాని, పోలీసులకుగాని ఇంతకాలం చెప్పలేదు.

    సాక్షి మెయిన్ పేజీలో వచ్చిన కథనాన్ని చూసి ఈ విషయమై ఆరా తీసేందుకు స్థానిక బీజేపీ నాయకులు ఉదయం ఆస్పత్రిని సందర్శించగా.. డ్యూటీ డాక్టర్ ఎస్.పద్మ ఉదయం రిజిష్టర్‌లో సంతకం చేసి 11 గంటల్లోపే వెళ్లిన విషయం వెలుగు చూసింది. దీంతో బీజేపీ నాయకులు కేవీఎ ల్‌ఎన్‌రెడ్డి, శివరాజ్‌యాదవ్, దేవరాయ ఎల్లయ్య, గూడెల్లి కనకారెడ్డి, ముక్కస్వామి వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరోమారు ఎమ్మెల్యే ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మృతుడి కుటుం బ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ఎందుకు విఫలయ్యారని ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బందిని నిలదీశారు.

    రంగాచారి మృతి సమాచా రం అందించడంలో.. రిజిష్టర్‌లో సంతకం చేసి 11 గంటలలోపే వెళ్లిన డ్యూటీ డాక్టర్ ఎస్.పద్మపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు మేకల కళింగరాజు, తిప్పారపు ఆనంద్, చెవెల్లి సంపత్, ఉల్లేంగుల కృష్ణ, యాదగిరి, సత్యనారాయణ, జోగు రమేష్, కొమురయ్య ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement