వనదేవతలను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు
వరంగల్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు మేడారం సమ్మక్క-సారలమ్మను శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మను మొక్కుకోగా, ఇప్పుడు బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నానని తెలిపారు.
వారంలో 3 రోజులపాటూ మేడారం జాతర జరిగేలా కృషి చేస్తామన్నారు. వచ్చే మేడారం జాతర వరకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గతంలో కంటే ఇప్పటి జాతరకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు.