దిగ్విజయ్‌సింగ్ విమర్శలు విడ్డూరం
కరీంనగర్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్థరహితమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం రేకుర్తిలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేయ డం మానుకోవాలని హితవు పలి కారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్నవాటితో పాటు లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ అని... ఆయారాం, గయారాంల పార్టీ అని, ఆ పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితి లేదని స్పష్టం చేశారు. అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా అవివేకమైన విమర్శలు చేయ డం వారి నైజమని దుయ్యబట్టారు. రుణాల మాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, పింఛన్ల పెంపు, సన్నబియ్యం పథకం ఇలాంటి ఎన్నో జనరంజకమైన పథకాలను ప్రవేశపెడుతుంటే కాంగ్రెస్ పార్టీ మున్ముందు కనుమరుగు అవ్వడం ఖాయమనే భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్‌పార్టీకి రాజకీయాలు చేయడం, డబ్బులు సంపాదించ డం, కుంభకోణాల్లో కూరుకుపోవడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
దిగ్విజయ్‌సింగ్ చౌకబారు ప్రకటనలు చేయడం గర్హనీయమన్నారు. దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్ మిషనరీలతో, పనిముట్లతో జెన్‌కో ద్వారా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను పారదర్శకతతో నిర్మిస్తున్నామన్నారు. తాగునీటి ఎద్దడి, కరువు నివారణ కోసం రూ.30 కోట్లు మంజూరు చేశామని తెలి పారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పనులలో అవినీతి జరుగుతుందని దిగ్విజయ్‌సింగ్ మాట్లాడటం బట్ట కాల్చి మీద వేయడమేనని మండిపడ్డారు. ఆ పనులకు టెండర్ల ప్రక్రియ జరుగలేదు, కాంట్రాక్టర్లు ఎవరికి దక్కాయో స్ప ష్టం కాకముందే విమర్శించడం తగదన్నారు.