
గణతంత్ర దినోత్సవంలో అపశ్రుతులు
గణతంత్ర దినోత్సవం వేళ పలు పార్టీలు, ప్రభుత్వ కార్యాలయూలు, పాఠశాలలో జెండ
నల్లబెల్లి/మరిపెడ/పరకాల/హన్మకొండ అర్బన్ :ఎగురవేసే సమయంలో అపశ్రుతులు దొర్లారుు. నల్లబెల్లి మండ గణ తంత్ర దినోత్సవం వేళ పలు పార్టీలు, ప్రభుత్వ కార్యాలయూలు, పాఠశాలలో జెండ ల కేంద్రం లోని టీడీపీ కార్యాల యం ముందు జాతీయ జెండాను ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మామిండ్ల మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. జెండా తాడును కర్రకు సరిగా ముడివేయకపోవడంతో మధ్యాహ్న సమయంలో కిందికి జారింది. మరిపెడ మండల పరిషత్ కార్యాలయంపైజాతీయ జెండాను ఎంపీపీ తాళ్లపెల్లి రాణీశ్రీనివాస్ ఆవిష్కరిస్తుండగా... ఇనుప స్థంబానికి ఏర్పాటు చేసిన చక్రం పగిలిపోయిం ది. జెండా విచ్చుకోక ముందే భవనంపై గల పోర్టుకోపై పడింది. కార్యాలయ సిబ్బంది తక్షణమే జెండా మూటను తీసి స్తంభానికి అమర్చారు.
పరకాల న్యూ దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో జెండాను తలకిందులుగా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిం చారు. సమావేశం నిర్వహించుకుని వెళ్లిపోయారు. కాలనీకి చెందిన కొందరు గుర్తించి సమాచారం అందించడంతోపాటు దాన్ని సరి చేసి ఎగురవేశారు. హన్మకొండ కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ కార్యాలయంలో పీడీ రాము జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. విషయం తెలుసుకున్న అధికారులు కొద్దిసేపటి తర్వాత జెండా అవనతం చేసి మళ్లీ ఎగురవేశారు. కలెక్టరేట్‌లో ఈ సంఘటన చర్చనీయాంశమైంది.