సాంకేతిక కారణాల రీత్యా అనుకోని సంఘటనలు జరిగితే బుధ, గురువారాల్లో 2 రోజులపాటు విద్యుత్ సరఫరాలో.....
సరఫరాపై అప్రమత్తం చేసిన తెలంగాణ ట్రాన్స్‌కో
హైదరాబాద్: సాంకేతిక కారణాల రీత్యా అనుకోని సంఘటనలు జరిగితే బుధ, గురువారాల్లో 2 రోజులపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, ఈ అసౌకర్యాన్ని మన్నించి వినియోగదారులు సహకరించాలని తెలంగాణ ట్రాన్స్‌కో మంగళవారం ఓ ప్రకటన లో విజ్ఞప్తి చేసింది. మరమ్మతు అవసరాల కోస ం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ నెల 19, 20 తే దీల్లో రామగుండం-చందాపూర్ 400కేవీ అం తర్రాష్ట్ర విద్యుత్ లైన్‌ను మూసేయనుంది. దీం తో గ్రిడ్ రక్షణ కోసం ఇతర గ్రిడ్‌ల నుంచి దక్షి ణ గ్రిడ్‌కు వచ్చే విద్యుత్‌ను ఈ 2 రోజుల పాటు దక్షిణ విద్యుత్ బట్వాడా కేంద్రం తగ్గించనుం ది.
ఇలా తెలంగాణకు వస్తున్న విద్యుత్‌లో 300 మెగావాట్లకు గండిపడనుంది. దీనికి తోడుగా, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యల వల్ల ఇప్పటికే 600 మెగావాట్ల సరఫరా నిలిచి పోయింది. సింహపురి 300 మెగావాట్లు, వీటీపీఎస్ 210 మెగావాట్లు, ఆర్టీపీపీ 210 మెగావాట్లు, కేఎస్‌కే 600 మెగావాట్ల ప్రాజెక్టుల్లో ఉత్పత్తి లేదు. ఈ లోటును అధిగమించేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏడాదిగా కోతల్లేకుండా సరఫరా చేస్తున్న విద్యుత్‌ను కొనసాగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా, కొత్త సమస్యలు పుట్టుకొస్తే విద్యుత్ సరఫరా ఇబ్బందిగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని ట్రాన్స్‌కో డెరైక్టర్ నర్సింగ్ రావు ‘సాక్షి’కి తెలిపారు.