
గాంధీఆస్పత్రి : కరోనాను నియంత్రించేందుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వైద్యులు తమవంతు సేవలు అందిస్తున్నారు. వీరు ముగ్గురూ గాంధీ ఆస్పత్రిలోనే వివిధ విభాగాల్లో వైద్యసేవలు అందించడం విశేషం.. గాంధీ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ సుబోధ్‌కుమార్, ఆయన సతీమణి డాక్టర్ కృష్ణవేణి గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు శుశ్రుత్ గాంధీ మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో హౌస్‌సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా సేవలు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఓ బాధ్యతలా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment