గాంధీఆస్పత్రి: ఆస్పత్రి నుంచి తనను డిశ్చార్జి చేయాలని ఓ కరోనా రోగి హల్‌చల్ చేసినట్లు తెలిసింది. లేదంటే ఆహారం తీసుకోనని భీష్మించడంతో సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు ఆ వ్యక్తిని సముదాయించినట్లు తెలిసింది. సూర్యాపేటకు చెందిన ఓ కరోనా బాధితుడు నెల రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 14 రోజుల అనంతరం పలుమార్లు నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గానే తేలడంతో డిశ్చార్జి చేయలేదు. (గ్రేటర్‌లో కరోనా టెన్షన్)
ఈ క్రమంలో సోమవారం అసహనం వ్యక్తం చేస్తూ 15 రోజుల క్రితం వచ్చినవారిని డిశ్చార్జి చేస్తున్నారని, నెల అయినా తనను చేయడం లేదని, ఆరోపిస్తూ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. 14 రోజుల తర్వాత నిర్ధారణ పరీక్షల్లో కరోనా నెగిటివ్ రావాలని, ఆ తర్వాత 24 గంటల్లో మరోమారు నిర్వహించే పరీక్షల్లో కూడా నెగిటివ్ వస్తేనే డిశ్చార్జి చేస్తామని, ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలని సముదాయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment