మీకు ఠాగూర్ సినిమా గుర్తుండే ఉంటుంది.
కరీంనగర్: మీకు ఠాగూర్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో కొంతమంది డాక్టర్లు డబ్బు కోసం శవానికి వైద్యం చేస్తారు. కేవలం సినిమాల్లోనే అలా చేస్తారనుకుంటే పొరపాటే. అచ్చం అలాంటి సంఘటనే ఒక హాస్పిటల్ లో జరిగింది. అదేంటో మీరే చూడండి....కరీంగనర్‌లోని శ్రీ లక్ష్మీ హాస్పటల్ డాక్టర్లు డబ్బు కోసం ఏకంగా వారం రోజలు పాటు శవానికి వైద్యం చేశారని బంధువులు ఆరోపించారు. బంధువులు తెలిపిన వివరాలు.. జనవరి26న అగ్నిప్రమాదం జరిగి 60 శాతం గాయాలతో ఉన్న హేమలతను స్థానిక శ్రీలక్ష్మీ ఆస్పత్రిలో చే ర్పించారు. ఈ క్రమంలో డాక్టర్లు ఆమెకు వైద్యం చేస్తునే ఉన్నారు. కాగా, గత వారం నుంచి ఆమె ఐసీయూలో ఉందని కలవడానికి బంధువులకు సైతం అనుమతినివ్వలేదు. ఈక్రమంలోనే బాధితుకలకు చెందిన పార్మా చదివే అమ్మాయి వచ్చి డాక్టర్లును నిలదీసింది. దీంతో డాక్టర్లు ఆ అమ్మాయికి మాత్రమే అనుమతినిచ్చారు. ఐసీయూలోకి వెళ్లిన ఆమె అక్కడ జరిగిన విషయాన్ని చూసి నిర్గాంతపోయి బంధువులకు మొత్తం విషయం చెప్పి డాక్టర్లను నిలదీసింది. దీంతో విషయం తెలిసిపోయిందని గ్రహించిన డాక్టర్లు హేమలత మృతదేహాన్ని వెంటనే మార్చురీకి తరలించారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ముందు గొడవకు దిగారు. వారం రోజులుగా శవానికి వైద్య చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. ఇప్పటికే రూ. 7లక్షలు ఖర్చుచేసినట్లు బాధితులు తెలిపారు. అయితే, ఆస్పత్రికి చెందిన డాక్టరు వినయ్‌కుమార్ మాత్రం వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రంలేదని చెప్పారు.