టీపీసీసీ ఎలక్షన్ కమిటీలో డీఎస్ | ds in tpcc election Committee | Sakshi
Sakshi News home page

టీపీసీసీ ఎలక్షన్ కమిటీలో డీఎస్

Published Wed, Mar 12 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

టీపీసీసీ ఎలక్షన్ కమిటీలో డీఎస్

టీపీసీసీ ఎలక్షన్ కమిటీలో డీఎస్

 సురేశ్‌రెడ్డి, షబ్బీర్ అలీలకు చోటు
 టీపీసీసీ ప్రచారకమిటీ ఉపాధ్యక్షుడిగా షబ్బీర్‌అలీ


 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలకు అవకాశం దక్కింది. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఏర్పడిన తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో 23 మంది ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించింది. కాగా  మంగళవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని ప్రకటించిన ఏఐసీసీ, షబ్బీర్ అలీని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఉపాధ్యక్షునిగా నియమించింది.
 
 1989లో మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన షబ్బీర్ అలీ ఆ తర్వాత 1994, 1999లలో టీడీపీ అభ్యర్థులు గంప గోవర్ధన్, యూసుఫ్‌అలీల చేతిలో ఓడిపోయారు. 2004లో గెలుపొం దిన షబ్బీర్ అలీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయనకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మైనార్టీ నేతగా ఎదిగిన షబ్బీర్‌కు టీపీసీసీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్షునిగా నియమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement