ఇక.. గ్రామపాలన పారదర్శకం
నల్లగొండ : మారుమూల గ్రామాలలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ-పాలనను అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలను ప్రంపంచంతో అనుసంధానం చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 2440 గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటుచేయడంలో భాగంగా జిల్లాలో 171 పంచాయతీలను ఎంపికచేశారు. అం దుకు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి. పంచాయతీలకు కంప్యూటర్లు సరఫరా చేయడానికి, బీఎస్‌ఎన్‌ల్ ద్వారా ఇంటర్‌నెట్ కనెక్షన్‌లన్నీ ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌లోనే ఈ-పంచాయతీల పాల నను మొదటి దఫాలో అందుబాటులోకి తేనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 171 క్లస్టర్ పంచాయతీలలో నల్లగొండ డివిజన్‌లో 65, భువనగిరి డివిజన్‌లో 53, మిర్యాలగూడ డివిజన్‌లో 53 పంచాయతీలు ఉన్నాయి.
237 కంప్యూటర్ల పంపిణీ..
ఈ-పంచాయతీల కోసం జిల్లాకు 237 కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటినిు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు ఒక్కొక్కటి చొప్పున 59, జిల్లా పరిషత్‌కు రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో రెండు కంప్యూటర్లు, మూడు డివిజన్ పంచాయతీల కార్యాలయాలకు మూడు కంప్యూటర్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేయనున్నారు. కంప్యూటర్ల పంపిణీ అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వనున్నారు.
గతంలో 18 పంచాయతీలలో ఈ-పాలన
గతంలో కూడా గ్రామ పంచాయతీలలో ఈ-పాలన అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 24 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. కానీ ఈ-పంచాయతీలుగా ఉన్న హుజూర్‌నగర్, దేవరకొండ పట్టణాలు నగర పంచాయతీలు కావడంతోపాటు మరో నాలుగు పంచాయతీలలో అమలు చేయలేకపోయారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామ పంచాయతీలలో ఈ-పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ పంచాయతీలతో కలిపి జిల్లాలో ఈ-పంచాయతీల సంఖ్య 189కి చేరనుంది.
ఇక.. అన్నీ పారదర్శకమే
- ఈ - పంచాయతీలలో అన్ని సేవలు కూడా పారదర్శకంగా అందించనున్నారు.
- పంచాయతీలకు వచ్చే ఆదాయం వివరాలతో పాటు ఖర్చుల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
- అంతే కాకుండా గ్రామంలోని అన్ని రకాల పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల పంపిణీ కూడా ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.