సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈ నెల 30 నుంచి ప్రారంభించేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కౌన్సెలింగ్ షెడ్యూలును జారీచేసింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని పేర్కొంది. వచ్చే నెల 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 5న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 7న సీట్లను కేటాయించనుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 19,780 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు 22,564 మంది ఉన్నారు. తేదీల వారీగా, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన వివరాలు, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను https:tsecet.nic.in వెబ్‌సైట్‌లో పొందొచ్చని వివరించింది. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు. స్పెషల్ కేటగిరీ వారికి హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంకులో ఉన్న సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
వెంటతెచ్చుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు సెట్ ర్యాంకు కార్డు, హా హాల్‌టికెట్, ఆధార్ కార్డు, హా పదో తరగతి మెమో,
డిప్లొమా/డిగ్రీ మార్కుల మెమో, డిప్లొమా/డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, హా 4వ తరగతి నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు (బీఎస్సీ వారు అయితే 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు), హా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, హా 2017 జనవరి 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం,
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు హా నాన్ లోకల్ అభ్యర్థులైతే వారి తల్లిదండ్రులు 10 ఏళ్లు తెలంగాణలో నివసించిన నివాస ధ్రువీకరణ పత్రం, హా రెగ్యులర్ చదువుకోని వారైతే 7 ఏళ్ల నివాస ధ్రువీకరణపత్రం.
నేటి నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
Published Fri, Jun 30 2017 2:20 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement