సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాటిలైట్/కేబుల్ టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా వంటి ప్రచార సాధనాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపైనర్లు, వారి తరఫున ఇతరులు ఇచ్చే ప్రకటనల ప్రచురణకు, ప్రసారాలకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి పొందాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా సంస్థలు కూడా రాజకీయ ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేసే ముందు సర్టిఫికెట్ ఉందో లేదో సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే కేబుల్ నెట్‌వర్క్ (రెగ్యులేషన్) చట్టం ప్రకారం ప్రచురణ, ప్రసార సామగ్రిని జప్తు చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో ఏర్పాటు చేశామన్నారు. ఇది చెల్లింపు వార్తలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా పరిశీలించి ఎన్నికల కమిషన్‌కు నివేదికలు పంపుతుందన్నారు. చర్య ల నిమిత్తం తగు సిఫార్సులు చేస్తుందన్నారు. మీడియా నిబంధనల అమలు విషయంలో కూడా ఎన్ని కల కమిషన్‌కు సహకరిస్తుందన్నారు. రాజకీయ ప్రకటనలు ప్రచురించేటప్పుడు ‘అడ్వర్టైజ్‌మెంట్ లేదా ప్రకటన’ అని తప్పనిసరిగా ప్రచు రించాలని లేదా ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకటనలకు ఈసీ అనుమతి తప్పనిసరి
Published Sun, Dec 2 2018 2:08 AM | Last Updated on Sun, Dec 2 2018 2:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment