కట్టుదిట్టంగా పంచాయతీ పాలన  | Effective To Panchayat Rule In Akkannapeta | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా పంచాయతీ పాలన 

Published Wed, Mar 20 2019 3:00 PM | Last Updated on Wed, Mar 20 2019 3:02 PM

Effective To Panchayat Rule In Akkannapeta - Sakshi

చౌటపల్లి పంచాయతీ భవనం  

సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్‌): గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈ సారి పంచాయతీల పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీకి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పంచాయితీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పట్టిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. 


సర్పంచ్‌లకు సవాలే.. 
గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే  పాట అయ్యింది. కాని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో లాగా ఈ సారి ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు ఏ పని చేయాలన్న గ్రామస్తుల సమావేశంలో తీర్మానాలు చేసి వారి సమక్షంలో నిధుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతీ సారి పంచాయతీకి  మంజూరయ్యే  నిధులు వాటి వినియోగానికి సంబంధించి విషయాలు ఎప్పకటిప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయితీలలో చేసే ప్రతి పని ఆన్‌లైన్‌లో పొందు పరచాల్సి ఉంటుంది. 


తీర్మానం లేకుండా చేస్తే పదవికి ముప్పే.. 
గతంలో లాగా గ్రామ పంచాయితీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటు వారిపై వేటు పడే అవకాశం ఉంది.గతంలో సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత వచ్చిన నిధులను తీర్మానాలు చేయకుండానే తీసుకునేవారు.కానీ ఈ సారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మానం చేసుకొని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. 


అంతా ఆన్‌లైన్‌.. 
ప్రియా(పంచాయితీ రాజ్‌ ఇనిస్టిట్యూషన్‌ అండ్‌ యూత్‌ అకౌంటింగ్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా పంచాయతీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. గ్రామాలలో పనిచేసే ప్రతీ అభ్యర్థి ఏఏ పనులు చేస్తున్నారు. ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారు.అనే విషయాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయతీకి ఏ గ్రాంటు ద్వారా నిధులు మంజూరయ్యాయి అందులో ఎన్ని ఖర్చు చేశారో కూడా పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. 


గ్రామ జ్యోతి వెబ్‌సైట్‌ ద్వారా.. 
పంచాయితీలకు ఎంత బడ్డెట్‌ మంజూరైంది.మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చుచేశారు. శానిటేషన్‌ వైద్యం, నీటి సరఫరా సోషల్‌ వర్కులు,సీసీ రోడ్డుల నిర్మాణం, సిబ్బంది వేతనాలు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పంచాయతీ ఖర్చు చేయగా ఇంకా పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయి. వాటి వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. 


నేషనల్‌ పంచాయతీ పోర్టల్‌ యాప్‌.. 
పంచాయతీ పరిధిలో జరుగుతున్న పనుల వివరాలు గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, కాలువలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా గ్రామ స్థాయి సమాచారం ఇందులో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలను యాప్‌లోఆన్‌లోడ్‌ ఆప్‌లోనే చేస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న పనులకు సంబంధించి వివరాలతో పాటు ఎన్ని నిధులు ఖర్చు అయ్యాయో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను  గూగుల్‌ స్టోర్‌ నుంచి అప్‌ లోడ్‌ చేసుకోవచ్చు.    

పారదర్శకత పెరిగింది..
పంచాయితీలకు సంబంధించి నిధులు ఖర్చుల వివరాలు పూర్తి స్థాయి లో యాప్‌ల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండడంతో పంచాయితీలలో అవినీతి తగ్గడంతో పాటు పాలన పారదర్శకంగా ఉంటుంది.గతంలో జరిగిన పనులకు సంబంధించి వివరాలు నిధుల ఖర్చుల వివరాలు కొత్త పనుల ఎంపిక కోసం ఈ యాప్‌ తోడ్పడుతుంది.వీటిపై ఆయా గ్రామ పంచాయితీల పాలకులు,యవకులు,మహిళలకు అవగాహన ఏర్పరచుకోవాలి. 
– దమ్మని రాము, ఎంపీడీఓ హుస్నాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement