సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగర రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులొచ్చేశాయి. నగరంలోని నలువైపుల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రవాణా సేవలందించేందుకు తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం సచివాలయంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రాలు జెండా ఊపి ప్రారంభించారు. పురపాలక శాఖ, టీఎస్‌ఆర్టీసీల సంయుక్త ఆధ్వర్యంలో నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కాగా తొలి విడతగా 40 బస్సులను ప్రారంభించామని, త్వరలో మిగిలిన 60 బస్సులను కూడా ప్రారంభిస్తామని అరవింద్ కుమార్ తెలిపారు. ఒలెక్ట్రా కంపెనీ ఈ బస్సులను తయారు చేసిందన్నారు. మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో త్వరలో 21 సీట్ల ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇతర పురపాలికలు చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోలను త్వరలో కొనుగోలు చేయనున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment