బాలుడికి అస్వస్థత: విమానం ల్యాండింగ్ | Emergency landing Boeing flight due to Child health condition serious | Sakshi
Sakshi News home page

బాలుడికి అస్వస్థత: విమానం ల్యాండింగ్

Published Wed, Apr 23 2014 5:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM

Emergency landing Boeing flight due to Child health condition serious

శంషాబాద్, న్యూస్‌లైన్: ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గరికావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం దోహా నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 380 విమానంలో ప్రయాణం చేస్తున్న ఏడేళ్ల బాలుడికి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పెలైట్ వెంటనే చెన్నై ఏటీసీని సంప్రదించినా అక్కడ ల్యాండ్ చేయడానికి వీలు కాలేదు. దీంతో శంషాబాద్ ఏటీసీ అధికారుల అనుమతితో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు విమానాన్ని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. బాలుణ్ని చికిత్స నిమిత్తం విమానాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలిం చారు. మళ్లీ తెల్లవారుజామున 4.30 గంటలకు విమానం ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement