
'కేసీఆర్ దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయ్'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. ఐదో ఎమ్మెల్సీ ఓడిపోతారని కేసీఆర్కు భయం పట్టుకుందని ఎర్రబెల్లి అన్నారు. ఎమ్మెల్యేల చుట్టూ మంత్రులను కేసీఆర్ బ్రోకర్లులాగా తిప్పుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే సహించేది లేదని, ఎవరైనా తప్పు చేస్తే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు పోయి మళ్లీ టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అధికార ఎమ్మెల్యేలు, మంత్రులను కేసీఆర్ హెచ్చిరించిన విషయం తెలిసిందే.