కవాతు నిర్వహిస్తున్న పోలీసులు
తిర్యాణి: ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా విని యోగించుకోవాలని ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండలకేంద్రం లో ఎన్నికలపై అవగాహన కోసం కేంద్ర బలగాలు పోలీసులతో వీధుల్లో కవాతు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఓటు గురించి బలవంతపెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, రాజకీయ నాయకులు పోలీస్ శాఖ అనుమతి పొంది ప్రచారాలు చేసుకోవాలన్నారు. యాక్షన్ టీం సభ్యుల ఫొటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment