voting right
-
Silent Village of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం
గందోహ్(జమ్మూకశ్మీర్): ఆరోగ్యంగా ఉండి కూడా ఓటేయడానికి బద్ధకించే పౌరులున్న దేశం మనది. అలాంటిది పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటేయడానికి ముందుకొచ్చి మొత్తంగా గ్రామానికే ప్రేరణగా నిలిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక గాథ ఇది. గ్రామంలో సగం కుటుంబాలకు సమస్యలు జమ్మూకశీ్మర్‌లోని డోడా జిల్లాలోని భద్రవాహ్ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతంలో దధ్‌కాయ్ గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో కేవలం 105 కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 55 కుటుంబాలను దశాబ్దాలుగా ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మూగ, చెవిటివారిగా మిగిలిపోతున్నారు. ఇలా గ్రామంలో 84 మంది ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, పదేళ్లలోపు 14 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మాట్లాడలేని కారణంగా ఈ గ్రామానికి సైలెంట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే పేరు పడిపోయింది. రేహమ్ అలీ ముగ్గురు కూతుళ్లు రేష్మా బానో(24), పరీ్వన్ కౌసర్(22), సైరా ఖాటూన్(20)లకూ ఏమీ వినిపించదు. మాట్లాడలేరు కూడా. అయితే ఓటేసి తమ హక్కును వినియోగించుకోవాలనే కోరిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో బలంగా నాటుకుపోయింది. ఈసారి ఎలాగైనా ఓటేస్తామని ముగ్గురూ ఘంటాపథంగా చెబుతున్నారు. వీళ్లు ఓటేస్తుండటం ఇదే తొలిసారికావడం విశేషం. బీజేపీ నేత జితేంద్రసింగ్ పోటీచేస్తున్న ఉధమ్‌పూర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఈ గ్రామం ఉంది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ఊరికొచి్చన మీడియా వాళ్లకు ఈ అక్కాచెల్లెళ్లు తమ ఓటర్ ఐడీ కార్డులు చూపించిమరీ చెబుతున్నారు. ‘ మొదటిసారిగా ఓటేయనున్న మ్యూట్ మహిళల ఉత్సాహం ఊరి జనం మొత్తానికి స్ఫూర్తినిస్తోంది’ అని పొరుగింటి వ్యక్తి జమాత్ దానిష్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ ఔత్సాహిత యువ మహిళా ఓటర్లను చూసి మొత్తం గ్రామమే గర్వపడుతోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఈ సారి ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ’’ అని గ్రామ మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్ రఫీఖ్ వ్యాఖ్యానించారు. -
న్యూజీలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు.. మన దగ్గర కూడా అమలయితే బావుండు!
మన దగ్గర కూడా అమలయితే బావుండు.. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ ఇచ్చి ఈజీగా ఓట్లు కొనవచ్చు! -
ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి?
‘మా బతుకులు ఎలాగూ తెల్లారిపోతున్నాయి. ఎన్నేళ్లిలా అణిగిమణిగి ఉండాలి? మా పిల్లలు చదువుకుంటున్నారు.. స్వతహాగా ఎదుగుతున్నారు. వారినీ మాలాగే అణగదొక్కేయాలనుకుంటే ఎలా? మాకెలాగూ తప్పలేదు. పెత్తందార్ల అడుగులకు యువత ఎందుకు మడుగులు ఒత్తుతుండాలి? మమ్మల్ని ధైర్యంగా ఉండాలని మా యువకులు చెబుతున్నారు. ప్రభుత్వం రక్షణగా ఉంటే సరేసరి. లేదంటే మమ్మల్ని మేమెలా కాపాడుకోవాలో మేమూ తెలుసుకుంటాం. ఏం మా ఓట్లు మేం వేసుకుంటామని అనడమే తప్పా? అదేమైనా నేరమా? మా హక్కును వినియోగించుకునే అవకాశం కూడా లేదా?’ ‘చూడండయ్యా. మేం రోజుకు కేవలం రూపాయిన్నర కూలికి వాళ్ల పొలాల్లో పనులకు వెళ్లాం. నలభై ఏళ్లుగా మా చెమట ధారపోస్తున్నాం. పిల్లలు చదువుకున్నారు. వారికీ ఆలోచనలు ఉంటాయి. మా ఓట్లు మేం వేసుకుంటామని అడిగితే వాళ్లను కొట్టేస్తారా. వాళ్లు ఉండే ఊరు మాత్రం బాగుండాలి. వాళ్ల వీధులు నున్నగా మారాలి. సిమెంటు రోడ్లు వేసుకోవాలి. మా వీధులు మాత్రం ఇలాగే మట్టి రోడ్లుగానే ఉండిపోవాలా?’ ఇదీ ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన దళితుడు అరవై ఏళ్ల నడిపయ్య ఆవేదన. ఇదీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న దళితుల ఆవేదన. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దశాబ్దాల తరబడి అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఓటు హక్కు వినియోగించుకుంటామన్న దళితులను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో వారంతా ఓటు వేయలేకపోయారు. ఎట్టకేలకు చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుతో తొలిసారి దళితులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ పెద్దలు దళితులపై బెదిరింపులకు దిగారు. ‘ఏరా.. మేం వద్దని చెప్పినా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేశారు.. ఎన్నికల ఫలితాలు రానివ్వండి.. మీ పని పడతాం’ అంటూ నిరుపేద దళితుల్ని బెదిరిస్తున్నారు. ఈ హూంకరింపులతో దళిత వర్గాల వారు భయకంపితులవుతున్నారు. ఎన్ఆర్ కమ్మపల్లిలో ఇప్పటికే 20 మంది సొంత ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. దళితులపై దాడులకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకునేందుకు పరుగులు తీస్తున్న పోలీసులు (ఫైల్) వెంకట రామాపురంతో మొదలై.. తిరుపతికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోని గ్రామం.. వెంకట రామాపురం. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని ఓ గ్రామమిది. మాజీ మంత్రి, దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్వగ్రామం కూడా ఇదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత సొరకాయలపాలెం (ప్రస్తుతం 662 ఓట్లు) పంచాయతీ నుంచి వెంకట రామాపురం (ప్రస్తుతం 377 ఓట్లు)ను విడదీసి ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. సీఎం చంద్రబాబు సామాజికవర్గం ప్రధానంగా పెత్తనం చెలాయిస్తున్న ఎన్ఆర్ కమ్మపల్లి, రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, గణేశ్వరపురం (కొత్తకండ్రిగ), కమ్మ కండ్రిగ, కొత్త కండ్రిగ, మిట్ట కండ్రిగ తదితర గ్రామాల్లోని దళిత ఓటర్లు, పేద వర్గాలకు చెందిన వారు స్వయంగా ఓటు వేసే అవకాశం లేదు. ఓటు వేయడం మాట దేవుడెరుగు.. కనీసం ఓటు వేయాలనే ఆలోచన చేసినా దాడులు తప్పేవీ కాదు. అరాచకాలు అన్నీఇన్నీ కావు తమ అభీష్టానికి, టీడీపీకి వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆలోచన చేసిన వారికి చుక్కలు చూపించడం రామచంద్రాపురం మండలంలోని పలు గ్రామాల్లోని చంద్రబాబు సామాజికవర్గం నేతలకు చాలా సాదాసీదా విషయం. నడిచే దారులు మూసేయించడం, వాటిపై ముళ్ల కంప (మెష్) వేయించడం, రేషన్ సరుకులు తీసుకోనివ్వకపోవడం, పచారీ కొట్లలో సరుకులు కొనుగోలుకు అనుమతించకపోవడం, ఊరి కట్టుబాటు పేరుతో కట్టడి చేయడం వంటి అరాచక చర్యలతో భయకంపితులను చేస్తారు. ఈ దురాగతాల వల్ల ఆ సామాజికవర్గం వారిని ఎదిరించడానికి ఇతర కులాలు, వర్గాల వారు సాహసించరని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. 2014లో సింగిల్ విండో ఎన్నికల సమయంలో తాము ఓటు హక్కు వినియోగించుకుంటామని అన్నందుకు దళిత యువకులతోపాటు మరికొందరిని కోళ్లఫారాల్లో వేసి చితకబాదారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. వారిపై ఆధారపడుతున్నందునే ఈ దాష్టీకాలు గ్రామాల్లోని దళితులు, ఇతర పేదలు రైతుల వద్ద అప్పులు తీసుకుంటుంటారు. వ్యవసాయ పనులకు, ఇతర అవసరాలకూ గ్రామ పెద్దలపైనే ఆధారపడాలి. ఈ కారణంగా చంద్రబాబు సామాజికవర్గం వారిపై పెత్తనం చెలాయిస్తోందని డివిజనల్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘పాతతరం వారు అణిగిమణిగి ఉండేవారు. ఇప్పటి తరం వ్యవసాయ పనులకు వెళ్లటం లేదు. ఏదో ఒక సాంకేతిక నైపుణ్యంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆటోలు తోలుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్న వారిని యువత అంగీకరించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరించడానికి ముందుకొస్తున్నారు. దీన్ని అగ్రవర్ణాల వారు భరించలేకపోతున్నారు’ అని వివరించారు. ఎన్నిసార్లు విన్నవించినా.. తమకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారికి, పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన పలువురు దళిత యువకులు ‘సాక్షి’కి చెప్పారు. ‘ఏంట్రా.. మీకు ఓట్లు కావాలా’ అని ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన చంద్రబాబు సామాజికవర్గం వారు దారికాచి ఐదుగురిని చితకబాదారని వాపోయారు. తక్షణ అవసరాలకు బంగారం కుదువపెట్టి డబ్బు తెచ్చుకుంటే ఆ డబ్బు వైఎస్సార్సీపీ వారి వద్ద నుంచి తీసుకున్నారని కొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చూడండి సార్.. మా బాబాయ్ ఆటో ఎలా ధ్వంసం చేశారో. ఆయన రోజుకు రూ. 1,000 సంపాదించుకునేవారు. తెల్లవారుజామున తిరుపతికి వెళ్లి షాపులకు చికెన్ వేసేవారు. ఆటో ధ్వంసం చేయడంతో వారం రోజులుగా జీవనోపాధి కోల్పోయారు’ అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉండాల్సిందే.. తిరుపతికి అత్యంత సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి దౌర్జన్యాలను, కుల వివక్షను మేం కూడా అంగీకరించలేకపోతున్నాం. కొందరు అధికారుల తప్పిదాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. ఓటరు పోలింగ్ కేంద్రం లోపలకు రాగానే వారి వేళ్లపై సిరా పూసి స్లిప్పు ఇస్తారట. ఓటు మాత్రం ఎవరో వేస్తారట. సీసీ కెమెరాల పొజిషన్ కూడా మార్చేస్తారట. ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటే పోలింగ్ అధికారులు ఏం చేస్తున్నట్లు. చివరకు ఇవన్నీ మా విభాగానికి చుట్టుకుంటాయి’ అని రామచంద్రాపురం మండలంలో పోలింగ్‌ను పర్యవేక్షించడానికి అమరావతి నుంచి వచ్చిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఫోన్లో ‘సాక్షి’కి చెప్పారు. అందుకే సంబంధిత పోలింగ్ అధికారులపై మరింత కఠిన చర్యలు ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు మొరపెట్టుకున్నా.. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు బ్రాహ్మణ కాలవను సందర్శించినప్పుడు గ్రామస్తులు వారి కాళ్లపై పడి తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో తమ వాళ్లు కూడా అక్కడే ఉన్నారని గంగిరెడ్డిపల్లికు చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఏవీ బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. కమిషన్ సభ్యులు జిల్లా అధికారులతో మాట్లాడారని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు పాతకందుల వారి పంచాయతీ ఐఏవై కాలనీకి చెందిన దళిత యువకుడికి టీడీపీ నాయకులు రూ.2 వేలు జరిమానా విధించారంటేæఅధికార పార్టీ దాష్టీకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతోంది. అయ్యో... దండం పెడతాం, మీరు గమ్ముగుండండయ్యా.. అయ్యా... మీకు దండం పెడతాం. మీరంతా గమ్ముగుండండయ్యా... నోళ్లు మూసుకోండి. ఎదురు మాట్లాడి ఎందుకయ్యా వాళ్ల చేతుల్లో పడి చచ్చిపోతారు.. అని ఎన్ఆర్ కమ్మపల్లి దళితవాడకు చెందిన మహిళలు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఆ పొరుగూరోళ్లతో (సాక్షి ప్రతినిధులని వాళ్లకు తెలియదు) మాట్లాడవద్దంటూ వారించారు. ఆ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతున్నా... పోలీసులు అక్కడే వారి సమీపంలో ఉన్నప్పటికీ దళితుల మాటల్లో వణుకు, కళ్లలో దైన్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ‘ఎందుకమ్మా మీరు అలా భయపడుతున్నారని’ అడగ్గా.. ‘ఏందోనయ్యా, మా ఖర్మ ఇంతే. పిల్లోళ్లు ఓట్లు వేస్తామన్నారట. అంతేనయ్యా దోవలో వస్తున్న వారిని పట్టుకుని కొట్టేశారు. మీరైనా, పోలీసోళ్లు అయినా మాకాడ ఎన్నాళ్లు ఉంటారు. పోలీసోళ్లు ఉన్నన్ని రోజులు మా జోలికి రాకపోవచ్చు. ఆ తరువాత ఏమవుతుందో మాకు తెలుసయ్యా. అందుకే ఏం మాట్లాడవద్దని మా వాళ్లను బతిమలాడుకుంటున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధ మహిళలు. పునరావృతం కాకుండా చూడాలి ఇకనైనా అధికారులు తప్పులు జరగకుండా చూడాలి. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యం చెందిందంటూ చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరుగుతూ గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆయన సొంత నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టీకాల గురించి కూడా ఆయనే వెల్లడించాలి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే ఆగడాలు వారికి అలవాటే.. దళితులపై ఆగడాలు చేయడం వారికి అలవాటే. జిల్లాలోని చాలాచోట్ల ఓ సామాజికవర్గం వారికి దళితుల పట్ల చిన్నచూపు ఉంది. ఎందుకంటే దళితులు తమ ఆర్థిక అవసరాలకు ఆ సామాజికవర్గంలోని ధనిక రైతులపై ఆధారపడుతుంటారు. పశువులు మేపుకోవాలన్నా, గడ్డి తెచ్చుకోవాలన్నా, కట్టెలు కొట్టుకోవాలన్నా, పొలాల్లో నడవాలన్నా వారికి అనుకూలంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తారు.. బెదిరిస్తారు.. దాడులు చేస్తారు. అయినా సరే నమ్మకం కుదరదు. అందుకని పోలింగ్ కేంద్రం వద్దకు కూడా దళితులను రానివ్వరు. ఈ పరిస్థితులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. – సుబ్రమణ్యం, కేవీపీఎస్, రాష్ట్ర అధ్యక్షులు -
1,095 ఓట్లకు.. 27 ఓట్లు పోల్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి సమీపంలోని బందంపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో 1,095 మంది ఓటర్లుండగా కేవలం 27 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని మెజార్టీ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామపంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో అన్యాయంగా విలీనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో కలపడం ద్వారా ఉపాధిహామీ పథకం దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలి
తిర్యాణి: ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా విని యోగించుకోవాలని ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండలకేంద్రం లో ఎన్నికలపై అవగాహన కోసం కేంద్ర బలగాలు పోలీసులతో వీధుల్లో కవాతు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఓటు గురించి బలవంతపెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, రాజకీయ నాయకులు పోలీస్ శాఖ అనుమతి పొంది ప్రచారాలు చేసుకోవాలన్నారు. యాక్షన్ టీం సభ్యుల ఫొటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. -
మీ ఓటే.. మా భవిష్యత్తు
ఆదిలాబాద్‌టౌన్: ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు వేసే ఓటుతో మా భవిష్యత్తు ముడిపడి ఉందని జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులను కోరుతున్నారు. ఓటు అనే ఆయుధం గురించి విద్యార్థులు పూర్తి స్థాయిలో తెలుసుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థులు వారి వారి మాతృభాషల్లో అమ్మానాన్నకు అర్థమయ్యే రీతిలో ఓటు ప్రాముఖ్యత వివరిస్తున్నారు. విద్యార్థులకు ఓటు వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఓటు అంశంపై జిల్లాలోని ఆయా పాఠశాలల్లో క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్, జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో, డైట్ కళాశాలల్లో మాదిరి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటింగ్ యంత్రం, వీవీ ప్యాట్ గురించి తెలియజేస్తున్నారు. ఓటు అనే ఆయుధంతోనే సమాజంలో మార్పు తీసుకురాగలమనే విషయాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. విద్యార్థులకు పోటీలు.. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధి కారి, ఇద్దరు పీఓలు, ముగ్గురు ఏజెంట్లు, ఒక పో లీసు కానిస్టేబుల్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇద్దరు రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సెక్టార్ అధికారి, పది మంది ఓటర్లు పాత్రల్లో ఎన్నికల నిర్వహణ చేపడుతున్నారు. శని వారం నుంచి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులు అందజేయనున్నా రు. 25న జిల్లా స్థాయిలో జెడ్పీ సమావేశ మం దిరంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి జిల్లా స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7,500, తృతీయ బహుమతి రూ.5వేల నగదుతో పాటు షీల్డ్ అందజేస్తారు. నిజ జీవితంలో నేనే రాజకీయ నాయకుడిని అయితే అనే అంశంపై ఇద్దరు విద్యార్థులతో డిబేట్ నిర్వహిస్తారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలతోపాటు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు లేఖలు రాసి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఓ సారి ఆలోచించి ఓటు వేయాలని, ఓటుతో మాకేమి పని అంటూ నిర్లక్ష్య ధోరణిని వీడాలని కోరుతున్నారు. డిసెంబర్ 7న ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ లేఖలో రాయిస్తున్నారు. ఉత్తమ లేఖ రాసిన పది మందికి బహుమతులను ప్రదానం చేయనున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. -
హిమాచల్ ఓటింగ్‌లో మహిళలే టాప్!
సిమ్లా: ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.61% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,11,061 మంది పురుషులు ఓటు వేయగా, 19,10,582 మంది స్త్రీలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో స్త్రీల కంటే పురుషులు 72 వేల మంది అధికంగా ఉన్నప్పటికీ ఈ గణాంకాలు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాలకుగానూ కేవలం 15 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ..దాదాపు 48 నియోజకవర్గాల్లో మహిళల పోలింగ్ శాతం పురుషుల కంటే అధికంగా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనే అతిపెద్ద జిల్లా అయిన కంగ్రాలో 4.61 లక్షల మంది మహిళలు, 3.96 లక్షల మంది పురుషులు ఓటువేశారు. -
సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు
ఉన్నావ్(యూపీ): వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన మార్కు ప్రకటన చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అలా పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. హిందువుల మాదిరే ముస్లింలు కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ''నేను ముస్లింలు, క్రిస్టియన్లు తప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలనడం లేదు. జనాభా పెరుగుదలను అడ్డుకోవాలంటే దీనిని పాటించాల్సిందే. హిందువులు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నట్టే ముస్లింలు కూడా పాటించాలి. హిందువులు నలుగురు పిల్లల్ని కనాలంటే ఎంతో గొడవ చేశారు. అదే కొందరు నలుగురు భార్యల ద్వారా 40 మంది పిల్లల్ని కంటుంటే ఎవరూ ఏమీ అనరు''అని అన్నారు. జనాభా పెరుగుదల దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటని పేర్కొన్నారు. ''దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన జనాభా 30 కోట్లు. ఇప్పుడు 130 కోట్లు. దీనికి ఎవరు బాధ్యులు? హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు.. .. ఎవరైనా కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు.. ఎందరు పిల్లలైనా సమాజంలోని అన్ని వర్గాలకు ఒకే చట్టం ఉండేలా చూడాలి. అందరికీ వర్తించేలా ఉమ్మడి చట్టం తేకుంటే దేశానికే నష్టం. ఇందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ముందుకు రావాలి. ఈ చట్టాన్ని పాటించనివారి ఓటు హక్కును రద్దు చేయాలి'' అని పేర్కొన్నారు. వర్గాలను బట్టి మహిళల పట్ల వివక్ష పాటించడం తగదన్నారు. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని గతంలో సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించి, తర్వాత పార్లమెంట్లో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
నేనెందుకు ఓటెయ్యాలి?
నేను ఓటెయ్యను గాక వెయ్యను.... ఎందుకంటే నాకు పోలింగ్ బూత్ లో క్యూ కట్టి నిలుచుండటమంటే అస్సలు ఇష్టం ఉండదు. అది పరమ బోరింగ్ పని. కావాలంటే అదే రోజు గంటల పాటు సినిమా క్యూలో నిలుచుంటాను. కానీ మెడమీద తలకాయ ఉన్నవాడెవడైనా ఓటేస్తాడా? ఓటరు ఐడీ కార్డు కోసం ఎవడు అప్లై చేస్తాడు? దాని కోసం అంత హోమ్ వర్క్ చేసే టైమ్ ఎవరికి ఉంది? ఓటరు లిస్టులో నా పేరు నమోదు చేయించుకోవడమంటే చాలా కష్టం. కావాలంటే నాకు నచ్చిన చెప్పుల కోసం పది దుకాణాలు, ఇరవై వీధులు తిరుగుతాను కానీ ఓటరు ఐడీ కోసం గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతానా? సో అన్ ఫేషనబుల్....! ఎవడు అధికారంలో వస్తే నాకేమిటి? నాకు రాజకీయాలంటే పరమ బోర్... అసహ్యం. నేను పేపరు కొనను. కొన్నా స్పోర్ట్స్, సినిమా వార్తలు చదివి మిగతాది పక్కన పారేస్తాను. రాజకీయనాయకులందరూ అవినీతిపరులే. నాగారావు అయితేనేం, సర్పారావు అయితేనేం? అందరూ ఒక్కటే. నా ఒక్క ఓటుతో ఏం చేయగలను? నేను ఓటేసినా, వేయకపోయినా పెద్ద తేడా ఏముంటుంది? అసలు వోటెందుకు వేయాలి? చాలా సంతోషం సర్! మన బాధ్యత మనం నెరవేర్చం. కాబట్టి మనకు తగ్గ ప్రభుత్వాలొస్తాయి. ఆ తరువాత అయిదేళ్ల పాటు లబో దిబో. ఓటెయ్యకుండా ఉండేందుకు కోటి కారణాలు. ఓటేసేందుకు మాత్రం ఒకే కారణం. ఓటు మన హక్కు. ఓటు మన దిక్కు. అందుకే బద్ధకం వదలి... కావాలంటే ఓ కప్పు కాఫీ తాగి మరీ ఓటేయండి.