బాలికలను బైక్‌పై దించి వెళ్లిన వ్యక్తి ఎవరు ? | evidence in the case of students killed | Sakshi

బాలికలను బైక్‌పై దించి వెళ్లిన వ్యక్తి ఎవరు ?

Published Wed, Jan 6 2016 1:42 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

evidence in the case of students killed

విద్యార్థినుల మృతి కేసులో కీలక ఆధారం
బ్యాంక్ సీసీ టీవీ పుటేజీలో పలు దృశ్యాలు  
24వ  తేదీన చెన్నారావుపేటకు వచ్చిన విద్యార్థినులు

 
చెన్నారావుపేట : మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు భూమిక, ప్రియాంక మృతి కేసు విచారణలో రోజురోజుకు ఆసక్తికర విషయలు వెలుగులోకి వస్తుతున్నాయి. విచారణలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్ బ్యాంక్‌కు సంబంధించిన సీసీటీవి పుటేజీని స్థానిక ఎస్సై మంగళవారం పరిశీలించగా కీలక ఆధారం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. భూమిక, ప్రియాంక గత సంవత్సరం నవంబర్ 24న చెన్నారావుపేట మండల కేంద్రానికి చేరుకున్నట్లు సీసీ టీవీ పుటేజీలో వెల్లడైనట్లు సమాచారం. వీరిని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్ బ్యాంక్ ఆవరణలో దించి బ్యాంక్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. బ్యాంక్‌లోకి వెళ్లిన సదరు వ్యక్తి వెంటనే బయటికి వచ్చి విద్యార్థినులతో సుమారు 5 నుంచి 10 నిమిషాలపాటు ముచ్చటించి వెళ్లిపోరుునట్లు సమాచారం.

సదరు వ్యక్తి గీతలతో కూడిన ఆఫ్ టీ షర్ట్ వేసుకుని వచ్చినట్లు తెలిసింది. కొద్దిసేపటి తర్వాత సదరు వ్యక్తి బైక్‌పై వెళ్లిపోగా విద్యార్థినులు ఖాదర్‌పేట వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు బ్యాంక్‌లో సీసీటీవీల ద్వారా పోలీసులకు కనుగొన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు సదరు వ్యక్తి ఎవరనే విషయమై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి ఎవరు ? ఎందుకు విద్యార్థినులను బ్యాంక్ ఎదుట వదిలి వెళ్లాడు ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. సదరు గుర్తుతెలియని వ్యక్తిని పోలీసులు గుర్తించి విచారిస్తే విద్యార్థినుల మృతి వెనకగల మిస్టరీ వీడే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement