వివేక్ వస్తారా!
*సీఎంను కలిసిన మాజీ ఎంపీ వివేక్
*త్వరలో వరంగల్ ఎంపీ స్థానానికి ఎన్నికలు
*పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం
*రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
హన్మకొండ : వరంగల్ రాజకీయాల వైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ జి వివేక్ అడుగులు వేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే వరంగల్ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో వివేక్ బుధవారం సమావేశం కావడం జిల్లాలో చర్చకు దారితీసింది. వివేక్ తన తండ్రి వెంకటస్వామి స్మారక భవనం నిర్మాణం విషయంపై సీఎంను కలిసినట్లు విలేకరులతో చెప్పారు.
టీఆర్‌ఎస్‌లో చేరడం లేదంటూ స్పష్టం చేశారు.అయినా వివేక్ టీఆర్‌ఎస్‌లోకి పునరాగమనం చే సి వరంగల్ ఎంపీ బరిలో నిలబడతారనే ఊహాగానాలకు చెక్ పడలేదు. తాజా రాజకీయ పరిణామాలతో ఎంపీ శ్రీహరి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.దీంతో ఆయనవరంగల్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయూ ల్సి ఉంటుంది.
టీఆర్‌ఎస్ తరఫున ఎవరు అభ్యర్థిగా ఉంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో పెద్దపెల్లి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వివేక్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఆయన టీఆర్‌ఎస్‌లోనే కొనసాగారు. ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
ఇటీవల వివేక్ తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వెంకట స్వామి మృతి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంకటస్వామి సేవలకు గుర్తుగా ఆయన పేరిట స్మారక భవనం నిర్మిం చేందుకు సీఎం సానుకూలత వ్య క్తం చేశారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్ నేతలకు వివేక్‌కు మధ్య మాటల బంధం కుదిరింది. అంతేకాక వివేక్ ఆర్థికంగా స్థితి మంతుడు, గతంలో ఎంపీగా పనిచేసి న అనుభవం ఉంది. ఢిల్లీలో కూడా ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. సమస్యలపై గళమెత్తేందుకు వివేక్ సరైన నేత అనే వాదనలు ముందుకొచ్చాయి.