125 మందికి నేత్ర వైద్య పరీక్షలు | Eye Tests For 125 People | Sakshi
Sakshi News home page

125 మందికి నేత్ర వైద్య పరీక్షలు

Published Mon, Aug 6 2018 3:04 PM | Last Updated on Mon, Aug 6 2018 3:04 PM

Eye Tests For 125 People - Sakshi

నేత్ర వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు  

బరంపురం : స్థానిక హనుమాన్‌ బజార్‌ మెయిన్‌ రోడ్డులోని మానస్‌ భవన్‌లో హింజిలికాట్, సమరజోలొ శంకర్‌ ఐ ఆస్పత్రి, లయన్స్‌ క్లబ్‌ గెలక్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బరంపురం అదనపు తహసీల్దార్‌ సుశాంత్‌ కుమార్‌ సాహు పాల్గొని ప్రారంభించారు. శంకర్‌ ఐ ఆస్పత్రికి చెందిన నేత్ర వైద్యులు 125 మంది రోగులకు నేత్ర వైద్య పరీక్షలు చేశారు.

ఇందులో 25 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరిని అవసరమైతే శంకర్‌ ఫౌండేషన్‌ ఐ ఆస్పత్రికి తరలించనున్నట్టు లయన్స్‌ క్లబ్‌ గెలక్స్‌ ప్రాజెక్టు చైర్మన్‌ పి.ధర్మారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు పి.కె.పండా, లక్ష్మీనారాయణ, రజని పాత్రో, స్వాయ్యక్‌ సాహు, సరస్వతి పాత్రో, రజని మహాపాత్రో, ఉషారాణి పాఢి, సభి పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement