ఎర్రుపాలెం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన వచ్చిందని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మండలంలోని మామునూరులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ పాలన ఎన్నాళ్లో కూడా సాగదని అన్నారు. ఉత్తర తెలంగాణలోని ప్రజల్లో ఎక్కువగా ఉన్న తెలంగాణ వాదంతో మాత్రమే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందే తప్ప టీఆర్‌ఎస్‌కు కేడర్ లేదని అన్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్ మనుగడ నామమాత్రంగానే ఉంటుందని, జిల్లాలో ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపే ప్రసక్తి లేదని అన్నారు.
చిరకాలంగా ప్రజల మధ్య ఉంటూ విస్తృతంగా సేవలందించిన కాంగ్రెస్ పార్టీనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మెరుగైన పాలన అందించినప్పటికీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రచారం చేసుకోకపోవడంతోనే ఓటమిపాలైందని అన్నారు. త్వరలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటించేందుకు ఎర్రుపాలెం మండలం నుంచి జైత్ర యాత్రను ప్రారంభిస్తానని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ పదవి కట్టబెట్టినా చిత్తశుద్దితో పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్‌ది కుటుంబ పాలన..
Published Thu, May 29 2014 2:21 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
Advertisement
Advertisement