ఖమ్మం : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు బలవంతంగా తనువు చాలించాడు. ఈ సంఘటన ఖమ్మం మండలం కొండాపురంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పలి కనకం(35) భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.