గుడిహత్నూర్ : పేద, ధనిక తేడా లేకుండా అందరూ విరి విగా వాడే కూరగాయల్లో టమాట ప్రథమ స్థానంలో ఉంటుంది. దీంతో రైతులు టమాటా సాగుపై ఆసక్తి చూపుతుంటారు. ఖరీఫ్ సీజన్‌లో పండించే టమాటా విస్తీర్ణం ఎక్కువగా ఉంటుం ది. కేవలం వర్షాధారంగా పంట పండించవ చ్చు. చాలామంది టమాటా నారు పోసి మొక్క లు నాటి మందులు చల్లి పంట పండించేవారు.
పంట కాయదశలో ఉన్నప్పుడు వర్షాలు అధికంగా కురిస్తే నేలపై ఉన్న కాయలు కుళ్లిపోయి సుమారు 40 నుంచి 50 శాతం పంట నష్టపో యే అవకాశాలు ఉంటాయి. కానీ నూతనంగా ప్రభుత్వం ప్రతిపాదించిన స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చేసిన రైతులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో గత రెండు మూడేళ్లలో ఈ పద్ధతి అవలంబిస్తున్న రైతుల సంఖ్య పెరిగిపోతోంది. మండలంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 120 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకం అందజేస్తోందని హార్టికల్చర్ అధికారి జి.శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ పద్ధతి..
సాధారణంగా టమాటా మొక్కలు నాటిన తర్వాత వదిలేస్తారు. కానీ మొక్క పూత దశకు చేరుకోక ముందే స్టేకింగ్ పద్ధతిలో కొమ్మలు భూమికి తగలకుండా చేయాలి. ఇందుకోసం ఐదు అడుగుల ఎత్తు గల వెదురు కర్రలు 1,200 ప్రతీ ఎకరాకు అవసరమవుతాయి. దీంతోపా టు ఇనుప లేదా ప్లాస్టిక్ తీగలు 20 కిలోలు, జనుపనార ఒక క్వింటాల్ ముడిసరుకు అవసరం.
వీటితోపాటు ప్రతీ మొక్క వద్ద ఒక్కో కర్రను పాతి కర్రను పట్టుకుంటూ వెళ్లేలా ఇనుప తీగ అడ్డంగా కట్టాలి. ఆ తర్వాత ప్రతీ టమాటా మొక్క కొమ్మలు భూమికి తగలకుండా పైకి లేపి ఉంచుతూ జనపనారతో ఈ ఇనుప తీగలకు కట్టేయాలి. ఇలా చేయడానికి రాష్ట్రీయ కృషి వికా స్ యోజన పథకం ద్వారా ఎకరాకు రూ.7,500 ప్రోత్సాహకం అందుతుంది. అయితే ఇది ఒక్కో రైతుకు 2.5 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది.
టమాటా సాగులో స్టే‘కింగ్’
Published Thu, Sep 4 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement