చీడపీడల నివారణే కీలకం | Is crucial to the prevention of diseases | Sakshi
Sakshi News home page

చీడపీడల నివారణే కీలకం

Published Wed, Nov 5 2014 2:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

చీడపీడల నివారణే కీలకం - Sakshi

చీడపీడల నివారణే కీలకం

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ముగిసింది. దీంతో రైతుల ఆశలన్నీ రబీపైనే పెట్టుకున్నారు. ప్రధానంగా చీడ పీడల నుంచి కాపాడుకుని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఖరీఫ్‌లో కన్నా రబీలోనే వరి పంటలో అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయు అధికారి హరిప్రసాద్ పేర్కొన్నారు. వరిలో విత్తన ఎంపిక, నారుమళ్లు, సస్యరక్షణపై ఆయన వివరించారు.
 - చెన్నారావుపేట

 
అనువైన విత్తన రకాలు
జగిత్యాల సన్నాలు(జేజీఎల్-1798) : ఎకరానికి 2.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది.
వర్ష(ఆర్‌డీఆర్-355) : ఎకరానికి 2 టన్నుల దిగుబడి ఇస్తుంది. కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకువుుడుత పురుగుల్ని తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది.
జగిత్యాల సాంబ(జేజీఎల్-3844) : ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. చలిని, ఉల్లికోడును తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది.
జగిత్యాల వుసూరి( జేజీఎల్-11470) : పంటకాలం 130-135 రోజులు. ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. చలిని పూర్తిగా, చీడ పీడలను కొంత వరకు తట్టుకుంటుంది.
వరంగల్ సన్నాలు(డబ్యూజీఎల్-32100) : పంటకాలం 135 రోజులు. ఎకరానికి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఉల్లికోడు, అగ్గి తెగులును తట్టుకుంటుంది.
నెల్లూరి వుసూరి(యున్‌యుల్‌ఆర్-34449) : పంటకాలం 125 రోజులు. ఎకరానికి 3.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. అగ్గి తెగులు, చౌడును తట్టుకుంటుంది.
పద్యువ్ను(జేజీఎల్-17004) : ఇది స్వల్పకాలిక పంట రకం. 110 రోజుల్లో కోతకు వస్తుంది. చదరపు మీటరకు 60-65 కుదుర్లు ఉండేలా నాటుకుంటే ఎకరానికి 2.8 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడు, చలిని సవుర్థవంతంగా తట్టుకుంటుంది.
     
కాటన్‌దొర సన్నాలు(ఎంటీయూ-1010), విజేత(ఎంటీయూ-1001) : దొడ్డు రకాలు సాగు చేసే రైతులకు ఇవి అనువుగా వుంటారుు. 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. సుడి దోవు, అగ్గి తెగులును తట్టుకుంటారుు. ఎకరానికి 3.5 టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది. వీటిని సాగు చేస్తున్నపుడు పొలంలో విధిగా జింక్ సల్ఫేట్ వేసుకోవావలి. వీటితో పాటు ఐఆర్-64 రాశి, తెల్లహంస, పోతన, కృష్ణహంస, దివ్య, ఎర్రవుల్లెలు, శీతల్, వరాలు, రాజేంద్ర వంటి రకాలు కూడా అనువుగానే ఉంటారుు. ఆయూ ప్రాంతాల రైతులు వ్యవసాయు శాస్త్రవేత్తలు, వ్యవసాయూధికారుల సలహాలు తీసుకుని అనువైన రకాలను ఎంచుకోవాలి.

విత్తన మోతాదు-విత్తన శుద్ధి
సన్న రకాలైతే ఎకరానికి 10-15 కిలోలు, దొడ్డు రకాలైతే 20-25 కిలోల విత్తనాలు అవసరవువుతారుు. లీటరు నీటికి ఒక గ్రావుు కార్భండిజమ్ కలపాలి. ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. వురో 24 గంటలు వుండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాలను నారువుడిలో చల్లాలి.
 
నారు పోసుకునే సమయం
దీర్ఘకాలిక రకాలైతే నవంబర్ మొదటి వారం లోపు, వుధ్య కాలిక రకాలైతే రెండో వారం లోపు, స్వల్ప కాలిక రకాలైతే వుూడో వారం లోపు విత్తనాలు చల్లుకోవాలి. సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేనివారు డిసెంబర్ చివరి వరకు నారు పోసుకోవ చ్చు. ఏప్రిల్ మొదటి వారానికి కోతలు పూర్తయ్యేలా చూసుకోవడం వుంచిది. నారువుడి కోసం ఎంచుకున్న ప్రదేశాన్ని వుూడుసార్లు దవుు్మ చేసి, చదును చేయూలి. నీరు పెట్టడానికి, తీయుడానికి వీలుగా వేర్వేరు  కాలువలు ఏర్పాటు చేయూలి.
 
నారు త్వరగా ఎదగాలంటే..
రబీలో నారు మొక్కలు త్వరగా ఎదగాలంటే ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేయుడానికి సరిపడే నారువుడిలో 2 కిలోల నత్రజని(కిలోఎరువును విత్తనాలు చల్లేటపుడు, మిగిలిన ఎరువును 12-14 రోజులకు) ఎరువు వేయూలి. దుక్కిలో 1.5 కిలోల భబాస్వరం, కిలో పోటాష్‌ను అం దించే ఎరువులు వేయూలి. రాత్రి సవుయుంలో నారువుడిపై టార్పాలిన్‌షీట్ లేదా యుూరియూ సంచులతో కుట్టిన పరదాల్ని కప్పాలి. నారువుడిలో రాత్రిపూట నిల్వఉన్న నీరు చలి కారణంగా చల్లగా ఉంటుంది. కాబట్టి రోజూ ఉదయుం నీటిని తేసేసి కొత్త నీరు పెట్టాలి.

కాలిబాటలతో మేలు
పొలంలో కాలిబాటలు తీసి నాట్లు వేయడం ద్వారా పంటలో చీడపీడలు తగ్గుతారుు. సస్యరక్షణ చర్యలకు అనువుగా ఉంటుంది, ఎరువులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement