సాదాబైనామల రిజిస్ట్రేషన్ల గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కమలాపురం పట్టణంలో..
కమలాపురం : సాదాబైనామల రిజిస్ట్రేషన్ల గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కమలాపురం పట్టణంలోని హుజూరాబాద్ - పరకాల ప్రధాన రహదారిలో బుధవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. రైతులు రహదారిలో ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చించారు. ప్రభుత్వం గడువు పొడిగించేవరకూ ఆందోళన విరమించేదిలేదని రైతులు భీష్మించారు.