ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రాధాన్యత గమనించి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫీజులు చెల్లించడాన్ని ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టాలని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డా.ఎం.వి.రెడ్డి అధికారులను ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రాధాన్యత గమనించి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫీజులు చెల్లించడాన్ని ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టాలని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డా.ఎం.వి.రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన ఫీజు రీయింబర్స్ చేయాలన్నారు. స్కాలర్‌షిప్‌ల కోసం కాలేజీలకు తొలివిడత కింద కొంత మొత్తాన్ని విడుదలచేశామని, మిగతా డబ్బును త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాల్లోని జేడీలు, డీడీలు, ఏఎస్‌డబ్ల్యూఓ, హెచ్‌డబ్ల్యూఓలు, ఏఏఓలు, బ్యాంకు అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయా పథకాలపై సమీక్షించారు.