ఫిల్మ్ ఇండస్ట్రీ @ కరీంనగర్ | Film Industry, @ Karimnagar | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ ఇండస్ట్రీ @ కరీంనగర్

Published Mon, Nov 17 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

Film Industry, @ Karimnagar

శాతవాహన యూనివర్సిటీ: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ కరీంనగర్‌లో సినీ పరిశ్రమను ఏర్పాటుపై దృష్టి సారించారు. సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న నేటికాలంలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిన తరుణంలో ఎక్కడైనా సినిమాలను నిర్మించి, విడుదల చేయవచ్చంటున్నారు. అందులో భాగంగా కరీంనగర్‌లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ని ఏర్పాటు చేయాలని వర్మ భావిస్తున్నారు.

 ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎస్సారార్ కళాశాల వేదికగా ‘కరీంనగర్‌లో ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై ఈ నెల 18న ఉదయం 11 గంటలకు చర్చాగోష్టి నిర్వహించనున్నారు. సినిమా రంగంలో రాణించాలనే ఆసక్తి గలవారు ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మను కలిసే అవకాశాన్ని పొందవచ్చు.

సినీ రంగంపై ఆసక్తి, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు, గతంలో షార్ట్‌ఫిల్మ్ చేసినవారు, సినిమా గేయాలు, రచనలు చేసినవారు, ఆసక్తి ఉండి అవకాశం కోసం ఎదురుచూసే ఔత్సాహికులెవరైనా తమ బయోడేటాను ‘సాక్షి’ జిల్లా కార్యాలయానికి పంపవచ్చు. పూర్తి వివరాలకు 92480 20207, 90100 31916, 85238 61961 నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement