సీఎం కేసీఆర్ సమక్షంలో దీక్ష విరమించిన తెలంగాణవాది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని మొక్కులు మొక్కుకొని, టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆశించిన ఓ తెలంగాణవాది.. తన ప్రార్థనఫలించడంతో మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో తన దీక్షను విరమించాడు. ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గం పరిధిలోని కుబీర్ గ్రామానికి చెందిన ఫిరాజీ.. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యే వరకు చెప్పులు తొడగనని దీక్ష బూనాడు. స్వరాష్ర్టం సిద్ధించినప్పటికీ.. కొత్త రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని దీక్షను కొనసాగించాడు. ఈ రెండూ సాకారం కావడంతో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలసి మంగళవారం సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఫిరాజీని ముఖ్యమంత్రి ఆయనతో చెప్పులు తొడిగించారు.
ఎట్టకేలకు చెప్పులు తొడిగిన ఫిరాజీ
Published Wed, Nov 12 2014 2:17 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement