బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ సిటీ: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి పరిసర ప్రాంతాల్లోని చెట్లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో వాకర్లు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని ప్రస్తుతం మంటలను ఆర్పుతున్నారు. షార్ట్‌సర్క్యూట్‌కు గల కారణాలు తెలియరాలేదు. నిత్యం వీఐపీలు తిరిగే ఈ పార్కులో ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి.