
'తొలి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం'
కందకుర్తి : తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో గోదావరి పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కందకుర్తిలో జరిగిన పుష్కర శోభాయాత్రను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి పుష్కరాలను చాలా ఘనంగా జరుపుకున్నామని మంత్రి పోచారం అన్నారు.