రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి అమలుచేస్తున్న ఆహార భద్రతా పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర సర్కారు సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి అమలుచేస్తున్న ఆహార భద్రతా పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు కేంద్ర సర్కారు సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పేదరిక లెక్కలను తేల్చి అందుకనుగుణంగా బియ్యం కోటాను పెంచాలని విన్నవించనుంది. పేదరిక లెక్కలపై అధ్యయనం చేస్తున్న నీతి ఆయోగ్, రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియాలు వెంటనే ఈ అంశా న్ని తేల్చి ఆహార భద్రతను మరింత విస్తరించేందుకు తోడ్పాటును ఇవ్వాలని కోరనుంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ మేరకు నీతి ఆయోగ్ చైర్మన్‌గా ఉన్న ప్రధాని మోదీ, ఆహారశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌లను దీనిపై ప్రత్యేకంగా కలవనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న 1.08 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రమే సరఫరా చేయాలని ఆయన కేంద్ర మంత్రులను కోర నున్నారు.