వింటారా.. అలనాటి మధుర స్వరాలు | FM Radio Channel Launch In Hyderabad For Old Songs | Sakshi
Sakshi News home page

వింటారా.. అలనాటి మధుర స్వరాలు

Published Sat, Jul 14 2018 10:19 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

FM Radio Channel Launch In Hyderabad For Old Songs - Sakshi

బంజారాహిల్స్‌:  మ్యాజిక్‌ 106.4 ఎఫ్‌ఎం హైదరాబాద్‌లో మొట్టమొదటి రెట్రో ఎఫ్‌ఎం చానెల్‌గా శ్రోతలను ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. వింటూ మైమరిచిపోదామంటూ హైదరాబాద్‌ శ్రోతల జీవితంలోని మధుర స్మృతులను తిరిగి తీసుకురావడానికి మైమరిపించే పాటలను అలనాటి మేటి గీతాలను అందించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజ్‌కోటిలాంటి మరెందరో అలనాటి మేటి సంగీత దర్శకుల పాటలను వినిపించనుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7లో శుక్రవారం మ్యాజిక్‌ 106.4 ఎఫ్‌ఎం ప్రముఖ దర్శకుడు, దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు గ్రహిత కె.విశ్వనాథ్‌ చేతులమీదుగా ప్రారంభమైంది. ఆయన శ్రోతలతో మాట్లాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, నిర్మాత అశ్వినీదత్, హీరో రాజశేఖర్, జీవిత విచ్చేసి శ్రోతలతో మాట్లాడి అలరించారు. రోజంతా ఆర్జేలు, సెలబ్రిటీలు వేడుక జరుపుకున్నారు. టాలీవుడ్‌ గాయకుడు శ్రీకృష్ణ, జ్యోతి, మహతితో పాటు మురళి, సాగర్‌లు ఆర్‌జెలుగా వ్యవహరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement