సీఎం నియోజకవర్గంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ టోర్నమెంట్ | friendly policing tournment in kcr constituency | Sakshi
Sakshi News home page

సీఎం నియోజకవర్గంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ టోర్నమెంట్

Published Sun, May 24 2015 4:00 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

friendly policing tournment in kcr constituency

మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని యువతకు, పోలీసులకు మధ్య స్నేహబంధాన్ని పెంపొందించేందుకు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం ఫ్రెండ్లీ పోలిసింగ్ టోర్నమెంట్‌ను జిల్లా పోలీసు శాఖ తరపున నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంటును ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 25 న ములుగు మండలం వంటిమామిడి పరిధిలోని లక్ష్మక్కపల్లి గ్రామం వద్ద జరుగనున్న ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, మంత్రి హరీశ్‌రావు, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సునీత శ్రీకారం చుట్టారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన యువకులకు ప్రత్యేక శిక్షణనిచ్చి ఉద్యోగాల్లోకి తీసుకునే ఆలోచన చేస్తామన్నారు. ఈ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ విశిష్ట అతిథిగా హాజరవుతారని అధికారులు తెలిపారు.
(గజ్వేల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement