గ్యాస్ దందా.. | Gas danda | Sakshi
Sakshi News home page

గ్యాస్ దందా..

Published Fri, Aug 14 2015 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

Gas danda

జిల్లాలో జోరుగా అక్రమ వ్యాపారం
దాడులు చేసినా ఆగని అక్రమం
ఆరేళ్లలో 710 సిలిండర్లు స్వాధీనం
394 మందిపై కేసులు నమోదు  
 
 ఆదిలాబాద్ అర్బన్ : ఖజానా నింపేందుకు సర్కారు అన్ని దారులను అన్వేషిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటే.. జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ గ్యాస్ దందా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ సిలిండర్ల  అక్రమ వ్యాపారం రోజురోజేకూ పెరుగుతోంది. ఇంట్లో గృహావసరాలకు ఉపయోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో రోడ్లమీదే వెల్డింగ్ పనులకు, హోటళ్లలో, తదితర అవసరాలకు వినియోగిస్తున్నా.. అధికారులు మాత్రం అటువైపు చూడకపోవడం ఆశ్చర్యకరం. ఏడాదిపాటు అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినా తీరుమారడం లేదు.

ఏటా గ్యాస్ అక్రమ దందా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని తనిఖీల్లో తేలినట్లు అధికారలు పేర్కొంటున్నారు. పట్టణాలతోపాటు వివిధ గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు నల్లబజారు నుంచి తరలుతున్నాయనే విమర్శలున్నాయి. దాడులు నిర్వహించి అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాల్సిన పౌర సరఫరాల అధికారులు ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

 గృహావసర కనెక్షన్లు ఇలా..
 జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు సుమారుగా 1,29,600 ఉన్నాయి. ప్రతి వినియోగదారునికి ఏడాదికి పన్నెండు సిలిండర్లు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. సిలిండర్‌పై వినియోగదారుడికి వచ్చే రాయితీ సొమ్మును ప్రభుత్వం నేరుగా వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఆధార్ వల్ల రాయితీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చని ప్రభుత్వ భావించినా.. దానిలోని లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు గ్యాస్ దందా కొనసాగిస్తున్నారు.

2013 జూలై నెలలో జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ అనుసంధానం చేయడంతో సుమారు 75 వేలకుపైగా కనెక్షన్లు బోగస్‌గా తేలాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తే సంబంధిత వ్యక్తులు గృహావసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకోవడం, దీనికితోడు ఒకరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ మంజూరైతే మరొకరికి సిలిండర్ ఇవ్వడంతో చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు సైతం బోగస్ కింద గుర్తించబడ్డాయి.

 ఆగని దందా..
 ఇదిలా ఉంటే పట్టణాల్లో సైతం విచ్చల విడిగా రోడ్ల మీద, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో గృహావసర సిలిండర్లను వాడుతున్నారు. పక్కా సమయానికి గ్యాస్ ఇవ్వడం లేదని ప్రజలు ఏజెన్సీల వద్ద మొరపెట్టుకుంటే.. మరోపక్క అదే గ్యాస్‌ను చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేసి అక్రమార్కులు సొ మ్ము చేసుకుంటున్నారు. ఆరేళ్లలో నిర్వహించిన దాడు ల్లో అక్రమంగా వినియోగిస్తున్న 710 సిలిండర్లు పట్టుబడ్డాయి.

394 మందిపై కేసులు నమోదు చేశా రు. స్వాధీన పర్చుకున్న సిలిండర్లను అధికారులు సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు అందజేశారు. కేసులు నమోదైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేందుకు పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీ ని ర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోం దనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఇకనైనా గ్యాస్ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 దందాలో కొన్ని ఇలా..
     పెద్ద సిలిండర్ నుంచి చిన్న చిన్న సిలిండర్లలో     రీఫిల్లింగ్ చేసి బయట అధిక ధరకు అమ్మడం.     (ఉదా : 15కేజీల సిలిండర్ రూ. 710కి లభిస్తే.. ఐదు కేజీల చిన్న సిలిండర్ రూ. 450 ధర ఉంది.)
     {V>Ò$× ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు అమ్మడం.
     పట్టణ ప్రాంతాల్లో ఇనుప సామగ్రి అతికించేందుకు గ్యాస్‌ను రోడ్లపైనే వాడుతుండడం.
     రాయితీ గ్యాస్‌ను వ్యాపారాల నిమిత్తం హోటళ్లలో వినియోగించడం.
     అధికారులు కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోకపోవడం.
 
 అక్రమ గ్యాస్ చట్టవిరుద్ధం

 గృహావసర సిలిండర్లు వ్యాపారానికి అక్రమంగా వినియోగిచడం చట్ట విరుద్ధం. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. రాయితీపై వచ్చే సిలిండర్లు వ్యాపారాల నిమిత్తం వినియోగించరాదు. ప్రజలు సైతం ఆ సిలిండర్లను వ్యాపార నిమిత్తం ఇయ్యొద్దు. అలా చేస్తే వారిపైనా కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. అక్రమంగా వినియోగించే వారిపై దృష్టి పెట్టాం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ గ్యాస్ అక్రమాన్ని అడ్డుకుంటున్నాం.
 - ఉదయ కుమార్, పౌర సరఫరాల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement