![ప్రజలకు చేరువలో పోలీస్ వాట్సప్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61458331665_625x300.jpg.webp?itok=5uZpptp9)
ప్రజలకు చేరువలో పోలీస్ వాట్సప్
ఇప్పటివరకు 674 ఫిర్యాదులు
ఇందులో ట్రాఫిక్ సమస్యలే అధికం
పరిష్కారంలో వేగంగా స్పందిస్తున్న పోలీసులు
జవాబుదారీగా వాట్సప్ కంట్రోల్ రూమ్
వాట్సప్ నంబర్ 94910-89257
వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ పోలీసులు నగర ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ‘పోలీస్ వాట్సప్’ను అందుబాటులోకి తెచ్చారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణలో ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేయడానికి వాట్సప్ వంటి సామాజిక మాధ్యమం సరైన సాధనంగా గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ 5న వాట్సప్ సేవలను ప్రారంభించి 94910-89257 నెంబర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్ ద్వారా ప్రజలు తమ చుట్టుపక్కల శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, ఏదైనా నేరం జరిగినా ఫొటో, వీడియో చిత్రీకరించి పోస్ట్ చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు, సిబ్బంది సమస్య పరిష్కారం కోసం తక్షణమే ఉపక్రమిస్తారు.
ఇలా స్పందిస్తారు..
వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌రూమ్‌లో ఉండే పోలీసు అధికారులు ఫిర్యాదుదారు నుంచి వచ్చిన మెస్సెజ్‌ను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియజేస్తారు. ఆ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కరించిన విషయూన్ని స్టేషన్ పోలీసులు తిరిగి కంట్రోల్‌రూమ్‌కు తెలియజేస్తారు. అక్కడి నుంచి విషయం ఫిర్యాదుదారునికి వెళ్తుంది. ఇలా.. వాట్సప్ నెంబర్ జవాబుదారీగా మారింది. దీంతో ఆయా స్టేషన్ అధికారులపై బాధ్యత పెరుగుతోంది. ఫిర్యాదుదారు వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.
674 ఫిర్యాదులు
కమిషనరేట్ పరిధిలో వాట్సప్ ప్రారంభమైన డిసెం బర్ 5 నుంచి ఇప్పటి వరకు 674 ఫిర్యాదులు అం దాయి. డిసెంబర్‌లోనే 136 ఫిర్యాదులు వచ్చాయి.
ట్రాపిక్ సమస్యలే అధికం
వాట్సప్ ద్వారా ఇప్పటివరకు అందిన 674 ఫిర్యాదులలో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఈవ్‌టీజింగ్, రోడ్లపై జరిగే గొడవలతో పాటు సివిల్ తగాదాలకు సంబందించిన ఫిర్యాదులు ఉన్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు సంబందించిన దృశ్యాలు సైతం ఈ నెంబర్‌కు పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా వాట్సప్‌కు వచ్చిన ఫిర్యాదును ప్రత్యేకంగా నియమిం చిన అధికారులు, సిబ్బంది ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకుని సంబందిత పోలీసు అధికారులకు ఫిర్యాదును, ఫిర్యాది సెల్‌నెంబర్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని....
మంచిర్యాలకు చెందిన అబ్బాయి, హన్మకొండకు చెందిన అమ్మాయి ఇరువురు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అంగీకరించని అబ్బాయి బంధువులు ఒక రోజు అమ్మాయి ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించారు. అమ్మాయి వాట్సప్ ద్వారా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాట్సప్ కంట్రోల్ రూమ్ అధికారులు తక్షణమే స్పందించారు. ఫిర్యాదు హన్మకొండ పోలీస్‌స్టే షన్‌కు పంపించారు. వెంటనే రంగంలోకి దిగిన హన్మకొండ ఇన్‌స్పెక్టర్ ఘటన స్థలానికి చేరుకుని అమ్మాయికి రక్షణ కల్పించడంతో పాటు అబ్బాయి బంధువులను అదుపులోకి తీసుకున్నారు.
ములుగు నుంచి వరంగల్‌వైపు వస్తున్న కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఆకతాయిలు ఆరెపల్లి వ ద్ద అదే మార్గంలో ద్విచక్రవాహనంపై వస్తున్న దం పతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇదే ప్రాం తానికి చెందిన ఒక పౌరుడు స్పందించి ఆకతాయి ల కారును ఫొటోతీసి పోలీస్ వాట్సప్‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారులు కారు నెంబరు ఆధారంగా ఖమ్మం జిల్లాకు సమాచారం అందించి ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు.
ఓ ఇద్దరు భార్యాభర్తలు కాజీపేట నుంచి భద్రకాళి దేవాలయానికి వెళ్లేందుకు రూ.60కి ఆటోను మాట్లాడుకున్నారు. గమ్యం చేరిన తర్వాత ఆటో దిగి డ్రైవర్‌కు రూ.160 ఇచ్చారు. అనంతరం తాము డ్రైవర్‌కు అదనంగా రూ.100 ఇచ్చామని గుర్తించి దంపతులు సదరు డ్రైవర్ గురించి వాకబు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో ఆటోపై ఉన్న అడ్డా నెంబర్‌ను వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదు చేశారు. కాజీపేట ట్రాఫిక్ పోలీసులు సదరు ఆటో ధర్మసాగర్‌కు చెందిందిగా గుర్తించి ఆటో డ్రైవర్‌నుంచి అధికంగా తీసుకున్న రూ.100ను భార్యాభర్తలకు ఇప్పించారు.