‘బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి.. మోసగాళ్లు ఉన్నారు జాగ్రత్త!’
కోస్గి : ‘బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి.. మోసగాళ్లు ఉన్నారు జాగ్రత్త!’ అంటూ ఓ వైపు హెచ్చరిస్తూనే సదరు వ్యక్తుల ఖాతాల నుంచి డబ్బులను క్షణాల్లో మాయంచేసిన సంఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. పట్టణానికి చెందిన బాల్‌రాజ్ వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్. స్థానిక ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐలో ఖాతాలు కలి గిఉన్నాడు. ఇదిలాఉండగా, ఈ నెల 7న (07739069614 నెంబరుతో) ఫోన్‌చేసి బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, తమ ఖాతాదారులను కొందరు మోసగాళ్లు మోసం చేస్తుండటంతో బ్యాంక్ వారు ఏటీఎం కార్డులకు కొత్త నెంబర్లను జారీ చేస్తున్నారని నమ్మిం చారు.
ఎలాంటి అనుమానం రాకుం డా బాల్‌రాజ్ దగ్గర ఉన్న రెండు ఏటీఎం కార్డులకు ముందుగానే రెండు పిన్ నెంబర్లను తెలియజేశాడు. అనంతరం పాత పిన్ నెంబర్‌ను బ్లాక్ చేయాలని, మోసగాళ్లు నిజమైన నెంబర్లను రాబట్టి బాధితుడిని ఫోన్‌లైన్‌లో ఉండమని క్షణాల్లో ఎస్‌బీహెచ్ ఖాతా నుంచి రూ.14 వేలు, ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.మూడు వేలు డ్రా చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు బ్యాంకుకు వెళ్లి ఆరాతీశా డు. సదరు నెంబర్ బీహార్ ప్రాంతానికి చెందినదిగా ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ సంఘటనపై బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై స్థానిక ఎస్‌బీహెచ్ మేనేజర్ నాగేశ్వర్‌రావు మాట్లాడు తూ.. కొన్ని రోజులుగా ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల నుంచి ఖాతాదారులకు ఫోన్‌చేసి డబ్బులు డ్రా చేసేం దుకు ప్రయత్నిస్తున్న సంఘటనలపై ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.