మీ ఎస్‌బీఐ ఏటీఎం పిన్ నంబర్ రిజక్ట్ అయిందని ఫోన్ వచ్చింది.
జన్నారం : మీ ఎస్‌బీఐ ఏటీఎం పిన్ నంబర్ రిజక్ట్ అయిందని ఫోన్ వచ్చింది. ఏటీఎం నంబర్ చెప్పగానే సీక్రెట్ కోడ్ చెప్పండని అడిగారు. తర్వాత మీ మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ వచ్చింది..చెప్పాలని కోరగా అది కూడా చెప్పారు. ఇంకేముంది అకౌంట్ నుంచి రూ.2 వేలు ఖాళీ అయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రంలోని లావుడ్యా రాములు అనే ఉపాధ్యాయుడికి జరి గింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనతో లబోదిబోమని, ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి అడుగ్గా దీనికి మేమేమి చేయలేమని, సీక్రెట్ కోడ్ నంబర్ మార్చుకోవాలని తెలిపారు.