నా కారునే ఆపుతారా? | ghmc official takes on jubilee hills police | Sakshi
Sakshi News home page

నా కారునే ఆపుతారా?

Published Sun, May 10 2015 8:27 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

ghmc official takes on jubilee hills police

హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ లో తనిఖీలకు సహకరించకుండా జీహెచ్ ఎంసీ అధికారిణి ఒకరు పోలీసులపై చిందులేశారు. ఖైరతాబాద్ డివిజన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న షర్లీ పుష్పరాగం కారును శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు ఆపారు.

అయితే తన కారునే ఆపుతారా అంటూ ఆవిడ పోలీసులపై ఒంటికాలిపై లేచింది. 'నన్నే అడ్డుకుంటారా' పోలీసులను దూషించింది. తనిఖీలకు సహకరించాలని కోరినా ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆమెపై లాండ్ అండ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె మద్యం సేవించిందా, లేదా అనేది పోలీసులు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement