రుణ మాఫీ హామీని బేషరతుగా అమలుచేయాలి | give full debt waiver to farmers | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ హామీని బేషరతుగా అమలుచేయాలి

Published Sun, Jun 8 2014 1:45 AM | Last Updated on Mon, Oct 1 2018 4:38 PM

give full debt waiver to farmers

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లక్ష రూపాయల రుణ మాఫీని బేషషరతుగా అమలుచేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్‌కు రైతు సంఘాల నాయకులు శనివారం ఖమ్మంలో వినతిపత్రం ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని, ఈ ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారని అన్నారు. రుణ హామీకి సీఎం షరతులు విధించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రుణ మాఫీ హామీని బేషరతుగా అమలు చేయకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని, వారు నిరాశ, నిస్పృహతో అఘాయిత్యానికి దిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎం.సుధాకర్, కొర్లకుంట గోవర్ధన్, అడపా రామకోటయ్య, తాతా భాస్కర్‌రావు, మలీదు నాగేశ్వరరావు, పోటు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement