రాజన్న బిడ్డకు ఘనస్వాగతం | given grand welcome to ys sharnila | Sakshi
Sakshi News home page

రాజన్న బిడ్డకు ఘనస్వాగతం

Published Tue, Dec 9 2014 12:05 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

రాజన్న బిడ్డకు ఘనస్వాగతం - Sakshi

రాజన్న బిడ్డకు ఘనస్వాగతం

ఇబ్రహీంపట్నంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన  షర్మిల

ఇబ్రహీంపట్నం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆ పార్టీ నాయకురాలు షర్మిల సోమవారం ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. షర్మిల వస్తున్న విషయం తెలిసి యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

పార్టీ జిల్లా నాయకుడు ఏనుగు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బొంగ్లూర్ గేటు నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. షర్మిల వెంట ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కొండా రాఘవరెడ్డి, గట్టు రాంచందర్‌రావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, ఏనుగు మహిపాల్‌రెడ్డి, కేసరి సాగర్, మహిళా నాయకురాలు అమృతసాగర్ ఉన్నారు.
 
యాచారం:  మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక  మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు జిల్లాలో సోమవారం ఘన స్వాగతం లభించింది. మూడు జిల్లాల సరిహద్దు అయిన మాల్ కేంద్రంలో షర్మిల ప్రయాణిస్తున్న బస్సుకు పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు ఎదురేగి స్వాగతం పలికారు.

నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై షర్మిల మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్తుందని తెలుసుకున్న ప్రజలు గునుగల్, యాచారం, చింతపట్ల, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి గేట్లు, నల్లవెల్లి చౌరస్తాలో పెద్ద సంఖ్యలో ఆమె రాకకోసం ఎదురుచూశారు. బస్సులో వెళ్తున్న షర్మిలను చూసి చేయి ఊపడంతో ఆమె కూడా ప్రతిగా అభివాదం చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  

తెలంగాణలో బలమైనశక్తిగా  ..
రాబోయే రోజుల్లో షర్మిల నాయకత్వంలో తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అమృతాసాగర్ పేర్కొన్నారు. షర్మిల రాక సందర్భంగా మాల్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్‌కు వేలాది మంది అభిమానులు ఉన్నారని అన్నారు. వచ్చే రోజుల్లో ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణలో షర్మిల పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు.  

వైఎస్సార్ విగ్రహావిష్కరణకు తరలిన కార్యకర్తలు  
ఆదిబట్ల : ఇబ్రహీంపట్నంలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం వివిధ గ్రామాల నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై ఉదయం నుంచే సందడి నెలకొంది. బొంగ్లూర్ గేట్ నుం చి ఇబ్రహీంపట్నం వరకు రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్ సీపీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలే కనిపించాయి. కార్యకర్తలు బొంగ్లూర్ గే ట్ నుంచి  బైక్ ర్యాలీ నిర్వహించారు. పరామార్శ యాత్రలో భాగంగా షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement